Home / NATIONAL / ఈటలకు బీజేపీ ఆఫర్ అదేనా..?

ఈటలకు బీజేపీ ఆఫర్ అదేనా..?

రేపు  మంగళవారం BJP లో చేరనున్న ఈటల రాజేందర్ కు రాజ్యసభ సభ్యత్వం లభిస్తుందని ఆయన అనుచరులు, అభిమానుల ఆశ.కానీ అది అంత సులభం కాదు.2014 లో కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ అధికారం హస్తగతం చేసుకోవడంతో ఏబీవీపీ,ఆర్ ఎస్ ఎస్ , విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ లోని నాయకులు బిజెపి పార్టీని అధికారంలోకి తేవడం కోసం ఎనలేని కృషి చేశారు. వారిలో కొందరికి బిజెపి ప్రభుత్వంలో అత్యున్నత పదవి కట్టబెడతారనే చర్చ ఉంది.

కాగా ఏబీవీపీ కార్యకర్తగా, ఫుల్ టైం వర్కర్ గా రాజస్థాన్, జమ్ము కాశ్మీర్ ,తదితర రాష్ట్రాల ఇన్చార్జిగా, పార్టీ పటిష్టతకు ఎనలేని కృషి చేసిన జాతీయ బిజెపి పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తెలంగాణ బిడ్డ.2010 నుంచి గోదావరి నది హారతి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉమ్మడి AP లో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బిజెపి అగ్రనేతలు,ఉమా భారతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను,సాధువులను,పీఠాధిపతులను తెలంగాణకు రప్పించారు. కర్ణాటక ,మధ్యప్రదేశ్ ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పార్టీ ఇన్చార్జిగా ఆయన అందించిన సేవలు, నాగపూర్, ఆర్ఎస్ఎస్ కార్యాలయంతోనూ ప్రధాన మంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా తోనూ ఆయనకున్న సంబంధాల నేపథ్యంలో ఆయన రాజ్యసభ పదవి రేసులో ఉన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారి ఉద్యోగం వదలి గత కొన్ని సంవత్సరాలుగా మోడీ మిషన్ లో పనిచేస్తున్న .అమర్నాథ్ , 2013 -14 సంవత్సరం నుంచి మోడీ మిషన్ సాఫ్ట్వేర్ టీంకు నాయకుడిగా , సోషల్ మీడియాలో గుజరాత్ సీఎంగా కొనసాగిన మోడీ, చేపట్టిన అభివృద్ధి,తదితర అంశాలు మేధావి వర్గాలలో విస్తృతస్థాయి ప్రచారం కల్పించడంలో అమర్ టీం కీలకపాత్ర పోషించిందని చెప్పుకోవాలి.రూర్కీ లో ఐటీ చేసిన అమర్ బిహెచ్ఎల్ ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బిజెపి పార్టీ అధికారంలోకి తేవడం కోసం తన వంతు కృషి చేయడంతో పాటు అనేక సందర్భాల్లో ఆ పార్టీ అగ్రనేతలు మేధోమథనంలో కూడా భాగస్వామ్యం అయ్యాడు.

భద్రాచలం కొత్తగూడెం పార్టీ ఇన్చార్జిగా , MSME సభ్యుడిగా కొనసాగుతున్నారు. నరేంద్ర మోడీ 2014 లో మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కార్యక్రమానికి రావలసిందిగా,తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్క అమర్నాథ్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ఆహ్వానం పంపించారు. రాజ్యసభ రేసులో లేకున్నా ఏదో ఒక కీలక పదవి దక్కవచ్చు అనే చర్చ నెలకొంది.

ఇదిలా ఉండగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ,మాజీ మంత్రి డీకే అరుణ ,మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి,విధాన పరిషత్ మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, బిజెపి అగ్రనేత స్వర్గీయ బంగారు లక్ష్మణ్ కుమార్తె,. శృతి, పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి గా కొనసాగిన డి రామ్ సుధాకర్ రావు, ఓ బి సి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్,. తదితర నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ,కెసిఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఊపిరి, సలపని పోరాటలు, ధర్నాలు ,ఆందోళనలు, చేస్తూ ఆర్థికంగా నష్టపోతూ తప్పుడు కేసులు నమోదై జైలుపాలు అవుతున్న విషయం విధితమే. వీరితో పాటు అనేకమంది చోటామోటా లీడర్లు ఏదో నామినేటెడ్ పదవి రేసు లో ఉన్నట్టు చర్చ.

రాజ్యసభ సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతానికి 245 మంది కొనసాగుతున్నారు ,ఇందులో 229 స్థానాలు రాష్ట్రాల శాసన సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడతారు. 9 స్థానాలు ఈశాన్య రాష్ట్రాల నుంచి మరో 12 స్థానాలను రాష్ట్రపతి వివిధ రంగాలలో నిష్ణాతులను నామినేట్ చేస్తారు. ప్రస్తుతం బిజెపికి 93,కాంగ్రెస్ కు 34,తృణమూల్ కాంగ్రెస్కు 11 మంది సభ్యుల సంఖ్య బలం ఉంది. మిగతా పార్టీ రెండంకెల సంఖ్య దాటలేదు. సభలో NDA 116 , UPA 54, ఇతరులు.62 మంది సభ్యులు ఉన్నారు.

2021 జూన్ 3 నాటి వరకు అస్సాంలో 7 స్థానాలకు .1 ఖాళీగా ఉంది, బీహార్లో 16 స్థానాలకు 1, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 4 స్థానాలకు , 4 ఖాళీగా ఉన్నాయి, కేరళ లో 9 స్థానాలకు 1, మహారాష్ట్రలో 19 స్థానాలకు 1, నామినేటెడ్ 12 స్థానాలు 2, తమిళనాడులో18 స్థానాలకు 3, పశ్చిమ బెంగాల్లో16 స్థానాలకు 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నట్టు, పార్లమెంట్ వెబ్సైట్లో పేర్కొనబడింది.

> సురేందర్,
సీనియర్ జర్నలిస్టు,
ధర్మపురి.