తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో..యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,హిట్ చిత్రాల దర్శకుడు కోరటాల శివ కాంబోలో వస్తున్న మూవీకి సంబంధించి క్రేజీ అప్డేడేట్ వచ్చింది. చిత్ర కథ అంతా విద్యార్థి రాజకీయాల చుట్టూ తిరగనుందట. జూనియర్ ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు-విద్యార్థుల భవిష్యత్ అనే కాన్సెప్ట్ మూవీ రానుందట. #NTR30 వర్కింగ్ టైటిల్తో నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యుధసుధ ఆర్ట్స్ …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ.. వకీల్ సాబ్కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ పింక్ రీమేక్ గా తెరకెక్కగా.. సీక్వెల్ కొత్త స్టోరీతో రానుందట. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్తో వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా స్త్రీ సంక్షేమంతో పాటు రైతుల చుట్టూ ఈ కథ తిరగనుందని తెలుస్తుంది.
Read More »50ఏళ్ళుగా ఓటమి ఎరుగని మాజీ సీఎం
కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ అపజయం అనేదే లేకుండా దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పూతుపల్లి నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. తొలిసారి 1970లో తనకు 27 ఏళ్లు ఉన్నప్పుడు చాందీ తొలి విజయం సాధించారు. ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఇది 12వ సారి. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 50 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Read More »సౌందర్యపై బయోపిక్
అలనాటి అందాల తార సౌందర్య జీవితకథను సినిమాగా తెరకెక్కించనున్నారని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. తాజాగా సౌందర్య సినీ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాల్ని ఆవిష్కరిస్తూ ఓ అగ్ర నిర్మాణ సంస్థ త్వరలోనే సినిమాను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. అగ్రహీరోలందరి సరసన నటించి.. తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన సౌందర్య పాత్రలో హీరోయిన్గా సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం.
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 58,742 మందికి పరీక్షలు చేయగా.. 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో చికిత్స పొందుతూ 49 మరణాలు సంభవించినట్లు హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,206మంది కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారికంగా 80,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »సరికొత్త సంప్రదాయానికి తెర తీసిన సీఎం జగన్
ప్రస్తుతం రాజకీయ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తరహాలో ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని జగన్ ముందు నుంచే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీ వంటి విధానానికి పూర్తిగా స్వస్తి పలకాలని గతంలోనే మంత్రి వర్గంలో …
Read More »అసోంలో పరువు నిలుపుకున్న బీజేపీ
అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో BJP కూటమి 75 స్థానాలను గెలుచుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి 50సీట్లలో పాగా వేసింది. ఇతరులు ఒక్క సీటు సాధించారు. బీజేపీ 60 స్థానాల్లో పట్టు సాధించింది.. మిత్రపక్షాలైన అసోం గణపరిషత్, UPPL లతో కలిసి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.సీఏఏ ఆందోళనలతో ఇబ్బంది ఎదురైనా.. పట్టు నిలుపుకుంది అధికార బీజేపీ పార్టీ…
Read More »ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ పై అలవోకగా విజయం సాధించింది. ముందు బౌలర్లు రాణించడంతో పంజాబ్ బ్యాటర్లను 166/6కే పరిమితం చేసింది. అనంతరం ఓపెనర్లు షా(39), ధవన్(69*) రాణించడంతో 17.4 ఓవర్లలో 167/3 స్కోర్ చేసి 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
Read More »భయమెరుగని దీదీ
1955 జనవరి 5న జన్మించిన మమతా బెనర్జీ 1975లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1984లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, లోకసభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ ఛటర్జీపై సంచలన విజయంతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. 1989లో ఓడి 1991లో మళ్లీ గెలిచారు. 36 ఏళ్లకే కేంద్రమంత్రి అయ్యారు. 1997లో టీఎంసీ పార్టీని స్థాపించారు. 1998, 99, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. 2011లో తొలిసారి బెంగాల్ గడ్డపై కమ్యూనిస్టులను గద్దె దించి, సీఎం …
Read More »తాను ఓడిన గెలిచిన దీదీ..అది ఎలా అంటే..?
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న ఆదివారం విడుదలయ్యాయి..ఈ ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ 213,బీజేపీ 77,ఇతరులు 2చోట్ల గెలుపొందారు.. అయితే ప్రధానమంత్రి నరేందర్ మోదీ,హోం శాఖ మంత్రి అమిత్ షా లాంటి రాజకీయ నేతలను ఎదుర్కొంటూ బెంగాల్లో ఒంటిచేత్తో తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించిన మమత.. తాను మాత్రం ఓటమి పాలైంది. సిట్టింగ్ స్థానమైన భవానీపూర్ను వదులుకున్నది..ప్రత్యర్థి విసిరిన సవాల్ ని స్వీకరించి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. …
Read More »