వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న ఆదివారం విడుదలయ్యాయి..ఈ ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ 213,బీజేపీ 77,ఇతరులు 2చోట్ల గెలుపొందారు.. అయితే ప్రధానమంత్రి నరేందర్ మోదీ,హోం శాఖ మంత్రి అమిత్ షా లాంటి రాజకీయ నేతలను ఎదుర్కొంటూ బెంగాల్లో ఒంటిచేత్తో తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించిన మమత.. తాను మాత్రం ఓటమి పాలైంది.
సిట్టింగ్ స్థానమైన భవానీపూర్ను వదులుకున్నది..ప్రత్యర్థి విసిరిన సవాల్ ని స్వీకరించి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. తమ పార్టీలో రెండో స్థానంలో ఉండి, ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన సువేందు అధికారిని ఓడిస్తానని సవాల్ విసిరారు. కానీ సీఎం దీదీకి అది సాధ్యం కాలేదు. సువేందు చేతిలో ఓటమి చవిచూశారు.