తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 6 ప్రశ్నోత్తరాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం జీరో అవర్ జరగనుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఈ నెల 18న మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Read More »చరిత్రలో లేనివిధంగా ఖమ్మంలో తొలిసారిగా వైఎస్ షర్మిల
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అసదుద్దీన్ శుక్రవారం లోటస్‌పాండ్‌లో షర్మిలను కలిశారు. అసదుద్దీన్‌తో పాటుగా ఆయన భార్య ఆనం మీర్జా కూడా ఉన్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు ఆనం మీర్జా సోదరి. రాజకీయ, క్రీడా రంగాల్లో ప్రముఖులైన అజారుద్దీన్, సానియా మీర్జాల కుటుంబ సభ్యులు కొత్తగా పార్టీ పెట్టనున్న షర్మిలను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారు మర్యాద పూర్వకంగానే కలిశారని లోట్‌సపాండ్ వర్గాలు …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో 1నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పాఠశాలల్లో కేసులు పెరుగుతుండటంతో 6,7,8 తరగతుల ప్రత్యక్ష బోధనను నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 9వ తరగతి విషయంలోనూ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన కొనసాగించే అవకాశం ఉంది. సోషియో ఎకనామిక్ ఔట్లుక్ నివేదికలో ఈ విషయాన్ని తెలియజేసింది.
Read More »మార్చి 22న సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 22న శాసనసభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. బడ్జెట్ పై చర్చ తర్వాత. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ పై ప్రసంగిస్తారు. ఆ రోజే పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 29-31% శాతం వరకు ఈ ఫిట్మెంట్ ప్రకటించే ఛాన్సుంది. దీనికితోడు కరోనాపై సీఎం కీలక …
Read More »తగ్గిన బంగారం ధరలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.45,930కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.42,100గా ఉంది. ఇక వెండి కేజీపై రూ.1000 తగ్గి రూ.71,500గా ఉంది
Read More »తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వార్తిక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2.20లక్షల మందికి ఈ స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వనున్నారు త్వరలో స్కూళ్లకు చేరనున్నాయి. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ప్రకటించారు. tsbie.cgg.gov.inలో ఇంటర్ మెటీరియల్ పొందొచ్చు
Read More »వైఎస్ షర్మిలకు మంత్రి గంగుల సలహా
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ తొమ్మిదో తారీఖున కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్న ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరిమణి వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ కోడలు అని చెబుతున్న షర్మిల.. బలవంతంగా ఏపీలో కలిపిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆ ఏడు మండలాల కోసం పాదయాత్ర చేస్తే ఇక్కడి ప్రజలు షర్మిలను తెలంగాణ …
Read More »కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ‘బెంగాల్ ఎన్నికల ప్రణాళికను షా విడుదల చేయడం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇది బీజేపీ ఎన్నికల విధానాలకు వ్యతిరేకం. ఈ నిర్ణయం తప్పుడు సంకేతాలను పంపుతోంది. మేనిఫెస్టోను బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు …
Read More »ఇలా చేస్తే రూ.300 తక్కువకు గ్యాస్ సిలిండర్
గత కొన్ని నెలలుగా గ్యాస్ ధర రూ.200 పెరగడంతో సామాన్యులపై గుదిబండలాగా మారింది అయితే, సబ్సిడీ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ రూ.300 తక్కువకు లభిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. గ్యాస్ సిలిండర్ పై కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద సబ్సిడీని రూ.174 నుంచి రూ.312 రూపాయలకు పెంచింది. స్కీం కింద రిజిస్టరైతే సబ్సిడీ లభిస్తుంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే ఈ …
Read More »ఏపీలో కొత్తగా 246 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 31,546 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 58 మందికి వైరస్ సోకగా చిత్తూరులో 45, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 23, తూర్పుగోదావరిలో 20, కర్నూలులో 15 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,091కి పెరిగింది. ఒకరోజు వ్యవధిలో 137 మంది కరోనా నుంచి …
Read More »