అనాటి హీరోలలో కాంతారావుకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2009 మార్చి 22న ఆయన మరణించారు. ఈ రోజు మధ్యాహ్నాం 12 గంటల సమయంలో కాంతారావు సతీమణి హైమావతి(87) గుండెపోటుతో మరణించారు. మల్లాపూర్‌లో ఉన్న వారి నివాసంలోనే ఆమె స్వర్గస్తులయ్యారు. హైమావతి మృతికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, …
Read More »తెలంగాణలో ఈ నెల 13 నుంచి రెండో విడత కరోనా వ్యాక్సిన్
తెలంగాణలో ఈ నెల 13 నుంచి వైద్య సిబ్బందికి రెండో విడత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గత నెల 16 నుంచి తొలి విడత డోస్ పొందిన వారికి వరుస క్రమంలో 28వ రోజున రెండో డోసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకొని, ఇప్పటివరకూ టీకా తీసుకోకుంటే శనివారం వేయించుకోవాలని.. తొలి డోసు తీసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని అధికారులు …
Read More »భారత జట్టుకు ఎదురుదెబ్బ
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికాసేపట్లో చెన్నై వేదికగా తొలి టెస్టు జరుగుతున్న సంగతి విదితమే..అయితే ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో మోకాలికి గాయమైన నేపథ్యంలో అతడ్ని తొలి టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అక్షర్ ఉన్నాడు. దీంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి మరి
Read More »ఈ నెల 7న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఈ నెల 7న(ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను …
Read More »రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శవంతమని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల, నల్లబెల్లి, దమ్మన్నపేట, ల్యాబర్తి, వర్ధన్నపేట గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందని, రైతును రాజును చేయడమే …
Read More »తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు
తెలంగాణలో వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, పెట్రోల్‌తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు గానీ, రోడ్డు …
Read More »తెలంగాణపై పర్యావరణవేత్త ఎరిక్ సోల్‌హెయిమ్ ప్రశంసలు
భారత్‌లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే పచ్చదనం పెంపులో ముందున్నదని నార్వేకు చెందిన రాజకీయ ప్రముఖుడు, ఐరాస మాజీ పర్యావరణవేత్త ఎరిక్ సోల్‌హెయిమ్ ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 3.7శాతం పచ్చదనాన్ని పెంచి పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సోల్‌హెయిమ్ నార్వే అంతర్జాతీయ అభివృద్ధిశాఖ మంత్రి గా, పర్యావరణశాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. …
Read More »తమీమ్ ఇక్బాల్ అరుదైన ఘనత
బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 3 ఫార్మాట్లలో ఒక దేశం తరపున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 60 టెస్టుల్లో 4,405, 210 వన్డేల్లో7,360,టీ20ల్లో 1,758 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు నమోదు చేశాడు. ఇక భారత్ తరపున టెస్టులు, వన్డేల్లో సచిన్… టీ20లో కోహ్లి టాప్ స్కోరర్లుగా ఉన్నారు.
Read More »విజయశాంతి వార్నింగ్.. ఎవరికి..?
తెలంగాణ బీజేపీకి చెందిన కార్యకర్తలకు ఉద్యమాలు, అరెస్టులు కొత్త కాదని ఆ పార్టీ నేత విజయశాంతి అన్నారు.పరకాల అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి కేసులో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి వేధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలను మాత్రం అరెస్టు చేయలేదని ఆరోపించారు. తాము తెగిస్తే జైళ్లు సరిపోవన్నారు.టీఆర్ఎస్ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే వరంగల్ …
Read More »గూగుల్ పొమ్మంది.. మైక్రోసాఫ్ట్ రమ్మంది
మీడియా సంస్థల వార్తలను తమ ప్లాట్ ఫాంపై చూపిస్తున్నందుకు ఆ సంస్థలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయానికి మైక్రోసాఫ్ట్ సానుకూలంగా స్పందించింది. అయితే కొంతకాలంగా గూగుల్, ఫేస్ బుక్ ఇందుకు నిరాకరిస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని గూగుల్ తెలిపింది. అవసరమైతే ఆస్ట్రేలియాలో తమ సేవలు నిలిపేస్తామంది. ఈ క్రమంలోనే తమ బింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా మైక్రోసాఫ్ట్ తాజా ప్రకటన చేసింది
Read More »