యాసంగి సీజన్ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ చేయడానికి సిద్ధమైంది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. గతేడాది 57.62 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయగా.. ఈ సీజన్‌లో 1.70 లక్షల మంది …
Read More »జనవరి 13నుండి ఐనవోలు జాతర
ఉమ్మడి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. ఈ జాతరకు అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు, అర్చకులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన భద్రత, లావెట్రీలు, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నటి లత గౌడ్
రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నటుతున్నరు తాజాగా గౌడ్ తెలంగాణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సినీ నటి బత్తిని లత గౌడ్ గారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో ఎల్లమ్మ గుడి వద్ద గౌడ కులస్థులకు తన వంతుగా ఉచితంగా 100 గిరక తటి మొక్కలు పంపిణీ చేశారు ..అనంతరం తాను …
Read More »టీమిండియా దెబ్బకు ఆసీస్ ఆలౌట్
మెల్‌బోర్న్‌లో భారత బౌలర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తన తొలి ఇన్నింగ్స్‌లో 196 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. ఆరంభంలో అశ్విన్ తన స్పిన్‌తో అదరగొట్టగా.. ఆ తర్వాత బుమ్రా టెయిలెండర్లను త్వరత్వరగా ఇంటికి పంపించేశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మాథ్యూ …
Read More »మానవాళికి మార్గదర్శకం భగవద్గీత : ఎమ్మెల్సీ కవిత
నిత్యం గీతా పఠనం చేయడం ద్వారా జీవితంలో సన్మార్గంలో పయనిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన ‘గీతాజయంతి మహోత్సవం’లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ముందుగా గో మాతను పూజించిన ఎమ్మెల్సీ కవిత, భారతీయ సంస్కృతిలో గో పూజకు ఎంతో విశిష్టత ఉందన్నారు. భగవద్గీతలోని ఎన్నో సూక్ష్మమైన, ఆధ్యాత్మికమైన అంశాలను వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా …
Read More »శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు హరీష్, గంగుల కమలాకర్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్, సుంకే రవిశంకర్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాజీ …
Read More »పెండ్లి పెద్దగా మారిన – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్
తన్నీరు.. పేరులోనే ఉంది. ఆ కన్నీరును తుడిచే గుణం.! అలాంటి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ అన్నీ తానై అండగా నిలిచి భాగ్య బరువు దించారు.* చదివించారు. పెద్ద చేశారు. పెళ్లి చేశారు. అనాథయిన అభాగ్యురాలికి మంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆపన్న హస్తం అందించారు. కష్ట కాలంలో ఉన్న బాలికకు విద్య బుద్ధులు అందించి బతుకు దెరువుకై ఉపాధినిచ్చారు. పెండ్లీడు వచ్చిన భాగ్య అభీష్టం మేరకు …
Read More »మెగా పవర్ స్టార్ ఇంట్లో క్రిస్మస్ వేడుకలు
డిసెంబర్‌లో మెగా ఫ్యామిలీ ఇంట సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. నిహారిక పెళ్ళిలో భాగంగా జరిగిన పలు కార్యక్రమాలకు మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి సందడి చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇక డిసెంబర్ 18న నిహారిక బర్త్‌డే వేడుకలని కూడా గ్రాండ్‌గా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ హాజరయ్యారు. ఆ ఫొటోలు కూడా అంతర్జాలంలో హల్ చల్ చేశాయి. గత రాత్రి …
Read More »రీమేక్ లో సునీల్
హీరో రిషబ్ శెట్టి కథానాయకుడిగా కన్నడలో ఘనవిజయం సాధించిన చిత్రం `బెల్‌బాటమ్`. ఇటవల `ఆహా` ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. హీరో పాత్రకు సునీల్ అయితే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. సునీల్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తికరంగానే ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఈ …
Read More »మహబూబాబాద్ లో 70 మందికి తీవ్ర అస్వస్థత
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో కొత్తరకం కొవిడ్ కలకలం రేపుతోంది. 70 మంది అస్వస్థతకు గురవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రి బాట పట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తీవ్ర అస్వస్థతగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Read More »