తెలుగు సినిమా ఇండస్ట్రీలో సృజనాత్మకతకు, కొత్త ఆలోచనా విధానానికి డిజిటల్ వేదికలు కొత్త రెక్కలనిచ్చాయని టాలీవుడ్ ప్రముఖ కథానాయిక సమంత వ్యాఖ్యానించింది. `ది ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్‌తో సమంత డిజిటల్ అరంగేట్రం చేయబోతోంది. ఈ సిరీస్ తొలి సీజన్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న రెండో సీజన్‌లో సమంత కూడా కనిపించనుంది. పూర్తి నెగిటివ్ క్యారెక్టర్లో తీవ్రవాదిగా కనిపించనుంది. దీని గురించి …
Read More »గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు షాక్
తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నగరంలోని ఫతేనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దాపురం కృష్ణగౌడ్ ఈ నెల 18 బీజేపీలో చేరనున్నారు. ఫతేనగర్‌లో జరిగే కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్, సీనియర్ నాయకులు గరికపాటి రామ్మోహన్‌రావు, పెద్ది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Read More »అధునాతన హంగులతో.. పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్య..
సిద్ధిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాల నిర్మాణాలకు ₹14 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలలను మంజూరు చేసుకున్నామని చెప్పారు.16 పాఠశాలలకు స్వంత భవనాలు ఉన్నాయ్.. 6 పాఠశాలలకు స్వంత భవనాలు లేక విద్యార్థులకు …
Read More »టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రంలో టీఎస్‌బీపాస్ నేటినుంచి అమల్లోకి వచ్చింది. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు, …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారి కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య మూడింతలు పెరిగింది. నిన్న కొత్తగా 502 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 1539 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,57,876కు చేరింది. ఇందులో 2,42,084 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా కేసుల్లో 14,385 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 11,948 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో …
Read More »పేపర్ కప్స్‌లో టీ తాగితే.. ఆరోగ్యానికి ముప్పే!
డిస్పోజల్ పేపర్ కప్స్‌లో టీ తాగితే ఏంకాదని మనం అనుకుంటాం. కాని ఆరోగ్యానికి అసలుకే ముప్పట. అవి ఎంతమాత్రం సురక్షితం కాదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్‌పూర్ పరిశోధకులు నిర్వహించారు. ఒకరోజులో మూడు డిస్పోజల్ పేపర్ గ్లాస్‌లలో టీ తాగిన వారి శరీరంలోకి 75,000 చిన్న మైక్రోప్లాస్టిక్ కణాలు వెళ్తాయట. ‘పేపర్ కప్స్‌లో టీ పోయడం వల్ల ఆ వేడికి …
Read More »హనీమూన్ లో రెచ్చిపోయిన కాజల్
టాలీవుడ్ కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లూ దంపతులు పెళ్లయినప్పటి నుంచి తమకు సంబంధించిన అప్ డేట్స్‌ను ఎప్పటికపుడు తమ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే కార్వా చౌత్ వేడుకల్లో పాల్గొన్న ఈ కపుల్..ఆ తర్వాత ఫొటోషూట్ లో కూడా పాల్గొన్నది. తాజాగా కాజల్-గౌతమ్ కపుల్ హనీమూన్ కు వెళ్లారు. ఇంతకీ ఈ జంట ఎంపిక చేసుకున్న హనీమూన్ లొకేషన్ ఏంటో తెలుసా..? సెలబ్రిటీలందరి ఫేవరెట్ టూరిజం స్పాట్ మాల్దీవులు. …
Read More »జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 24 బస్తీ దవాఖానాలు
హైదరాబాద్‌లోని పేదలకు మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే 199 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది..ఈ రోజు గురువారం నుండి మరో 24 అందుబాటులోకి రానున్నాయి. వాటిని ఉపసభాపతి పద్మారావుతోపాటు.. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. కొత్తగా కాచిగూడ, పార్శీగుట్ట, కుత్బుల్లాపూర్, గూలిపూర, మలక్‌పేట్, కవాడిగూడ పరిధిలో ప్రారంభంకానున్నాయి. దూల్‌పేట్, ఎర్రగడ్డ, …
Read More »ఇరవై ఐదో వసంతంలోకి మెహరీన్
ఇటీవలే ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెట్టింది పంజాబీ సొగసరి మెహరీన్. ఈ పుట్టినరోజు తనకు ఎన్నో మధురజ్ఞాపకాల్ని మిగిల్చిందని చెబుతోంది. లాక్‌డౌన్ తర్వాత కుటుంబంతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లిందామె. ఈ ప్రయాణ అనుభవాల్ని మెహరీన్ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత జీవితంలోని చాలా సంతోషాల్ని త్యాగం చేయాల్సివచ్చింది. కుటుంబంతో సరదాగా సమయాన్ని ఆస్వాదించి ఎన్నో ఏళ్లవుతోంది. లాక్‌డౌన్ ముగియగానే టూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నా. కోవిడ్ తర్వాత …
Read More »గ్రీన్ చాలెంజ్ లో అందాల భామలు
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియాచాలెంజ్ సినీరంగంలోని ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతోంది. భూమాతకు పచ్చటి రంగులను అద్దాలనే ఈ మహాకార్యంలో మేముసైతం అంటూ సినీ తారలు భాగస్వాములవుతున్నారు. మొక్కలను నాటుతూ ఈ కార్యక్రమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. గ్రీన్ ఇండియాచాలెంజ్‌లో కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ పాల్గొన్నది. హీరో నాగచైతన్య చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలను నాటింది. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌ను …
Read More »