ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అయితే, లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. మరోవైపు దుమ్కా ఖజానా కేసు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో లాలూకు ప్రస్తుతం …
Read More »ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ర్ట మంత్రివర్గం సమావేశం
ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ర్ట మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read More »క్రికెట్ దిగ్గజం బయోపిక్‌లో స్టార్ హీరో
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ బయోపిక్‌కు సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది. ముత్తయ్య మురళీధరన్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటింస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది. మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ త్వరలోనే రానుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి …
Read More »నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక: అప్‌డేట్స్
నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి 50 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా …
Read More »సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపుకు నాంది
ఏడేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపునకు నాంది పలుకుతాయాని నారాయణఖేడ్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఉప ఎన్నికల నార్సింగి మండల ఇన్‌చార్జి భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని భీమ్‌రావుపల్లి, వల్లూరు, నార్సింగి గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తమ ప్రభుత్వం రైతు బంధు, …
Read More »నేటి నుంచే బతుకమ్మ చీరెల పంపిణీ
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడుపడుచులకు ప్రభుత్వం అం దించే బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. 287 డిజైన్లలో, విభిన్న రంగుల్లో తయారుచేసిన కోటి చీరెలను ఇప్పటికే జిల్లాలకు పంపించారు. వీటి కోసం రూ.317 కోట్లను ప్రభుత్వం వెచ్చింది. తెల్లకార్డు ఉండి, 18 ఏండ్లు నిండిన మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరెలను పంపిణీ …
Read More »ముకేశ్ అంబానీ సంపద రూ.6,49,639 కోట్లు
ఫోర్బ్స్ భారతీయ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ ఆధిపత్యం కొనసాగుతున్నది. వరుసగా 13వ ఏడాదీ దేశ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన లిస్ట్‌లో 88.7 బిలియన్ డాలర్ల (రూ.6,49,639 కోట్లు) సంపదతో ముకేశ్ మరోసారి మొదటి ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. నిరుడుతో పోల్చితే ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత సంపద 37.3 బిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం. కరోనాలోనూ సంపద పరుగు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న …
Read More »సీఎం కేసీఆర్ పారదర్శకతకు పెద్దపీట
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల చట్టం-2020 (కొత్త రెవెన్యూ చట్టం)’ సామాన్య ప్రజలకు గొప్ప తోడ్పాటును అందించే అసామాన్య చట్టమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, బెన్నెట్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అభివర్ణించారు. భూమిని నమ్ముకున్న లక్షలమంది రైతులకు కొత్త చట్టంతో మేలు జరుగుతుందన్నారు. అవినీతికి ఆస్కారం ఇచ్చే విచక్షణాధికారాలను తొలిగించి, ప్రజలకు ప్రభుత్వం కొత్త చట్టంతో …
Read More »సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యఛేదనలో..రషీద్‌ఖాన్ (3/12), అహ్మద్(2/24), నటరాజన్(2/24) విజృంభణతో పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. పూరన్(37 బంతుల్లో 77, 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. తొలుత హైదరాబాద్.. బెయిర్‌స్టో(55 బంతుల్లో 97, 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), వార్నర్ …
Read More »గ్రీన్ చాలెంజ్‌లో శేఖర్ కమ్ముల
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ని ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, కొరియోగ్రాఫర్ బాబాభాస్కర్‌లు స్వీకరించారు.కార్యక్రమంలో భాగంగా గురువారం మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో జరుగుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్‌లో రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యత తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. …
Read More »