Home / SLIDER / సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రైజర్స్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యఛేదనలో..రషీద్‌ఖాన్‌ (3/12), అహ్మద్‌(2/24), నటరాజన్‌(2/24) విజృంభణతో పంజాబ్‌ 16.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. పూరన్‌(37 బంతుల్లో 77, 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. తొలుత హైదరాబాద్‌.. బెయిర్‌స్టో(55 బంతుల్లో 97, 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), వార్నర్‌ (52) అర్ధసెంచరీలతో 20 ఓవర్లలో 201/6 స్కోరు చేసింది. బిష్ణోయ్‌(3/29)కు మూడు వికెట్లు దక్కా యి.  బెయిర్‌స్టోకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

పూరన్‌ పోరాడినా

రైజర్స్‌ నిర్దేశించిన లక్ష్యఛేదనలో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ఆదిలో ఘోరంగా తడబడింది. ఇద్దరు ఇన్‌ఫామ్‌ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌(9), రాహుల్‌(11) తీవ్రంగా నిరాశపరిచారు. లేని పరుగు కోసం ప్రయత్నించిన మయాంక్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ప్రబ్‌సిమ్రన్‌సింగ్‌(11) అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో ఆరు ఓవర్లకు పంజాబ్‌ 2 వికెట్లకు 45 పరుగులు చేసింది. తొలి బంతినే బౌండరీగా మలిచిన పూరన్‌.. సమద్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 17 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ఓవైపు రైజర్స్‌ బౌలర్లను పూరన్‌ ఆటాడుకుంటే సహచరులు మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. మ్యాక్స్‌వెల్‌(7), మణ్‌దీప్‌సింగ్‌(6), ముజీబుర్‌ రెహమాన్‌(1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. రషీద్‌ఖాన్‌ మరోమారు తన సత్తాచాటుతూ పూరన్‌తో పాటు షమీ(0)ని వరుస బంతుల్లో ఔట్‌ చేయడంతో పంజాబ్‌ ఆశలు గల్లంతయ్యాయి.

బెయిర్‌స్టో, వార్నర్‌ వీర బాదుడు

హైదరాబాద్‌ ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌..పంజాబ్‌పై తమ ప్రతాపం చూపించారు.  కాట్రెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌తో మొదలుపెడితే దాదాపు ప్రతి ఓవర్లో బంతిని బౌండరీకి తరలించారు. షమీ ఐదో ఓవర్లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ విడిచిపెట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. తొలి ఓవర్‌కు దిగిన రవి బిష్ణోయ్‌ను వరుస బంతుల్లో బెయిర్‌స్టో 6,4, 6గా మలిచి తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. ఈ క్రమంలో బెయిర్‌స్టో ఈ సీజన్‌లో మూడో అర్ధసెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరి జోరుతో 15 ఓవర్లకు 160 పరుగులు అందుకున్న రైజర్స్‌ భారీ స్కోరు ఖాయమనుకుంటున్న తరుణంలో సీన్‌ పూర్తిగా మారిపోయింది.

41 పరుగులకు 6 వికెట్లు

వికెట్లు తీయలేక పూర్తి నిరుత్సాహంలో కూరుకుపోయిన పంజాబ్‌..ఆఖర్లో  అద్భుతంగా పుంజుకుంది. చివరి ఐదు ఓవర్లలో రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌ను అద్భుతంగా కట్టడి చేస్తూ కేవలం 41 పరుగుల తేడాతో 6 వికెట్లు నేలకూల్చింది. తొలుత బిష్ణోయ్‌ రెండు బంతుల తేడాతో వార్నర్‌, బెయిర్‌స్టోను బౌట్‌ చేసి

పంజాబ్‌ శిబిరంలో ఆనందం నింపాడు. ఊరించే బంతితో వార్నర్‌ను బోల్తా కొట్టించిన బిష్ణోయ్‌..బెయిర్‌స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన పంజాబ్‌కు సానుకూల ఫలితం దక్కడంతో మూడు పరుగుల తేడాతో బెయిర్‌స్టో సెంచరీ చాన్స్‌ చేజార్చుకున్నాడు. మరో ఎండ్‌లో అర్ష్‌దీప్‌సింగ్‌…మనీశ్‌పాండే(1), ప్రియమ్‌ గార్గ్‌(0)పెవిలియన్‌ పంపి ఒత్తిడి తీసుకొచ్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..విలియమ్సన్‌(20 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ(12) బౌండరీలతో హైదరాబాద్‌ 200 మార్క్‌ చేరుకుంది.

 స్కోరుబోర్డు

హైదరాబాద్‌: వార్నర్‌(సి)మ్యాక్స్‌వెల్‌(బి) బిష్ణోయ్‌ 52, బెయిర్‌స్టో (ఎల్బీ) బిష్ణోయ్‌ 97, సమద్‌ (సి)అర్ష్‌దీప్‌(బి)బిష్ణోయ్‌ 8, మనీశ్‌ పాండే(సి&బి) అర్ష్‌దీప్‌ 1, విలియమ్సన్‌ 20 నాటౌట్‌, గార్గ్‌(సి) పూరన్‌(బి)అర్ష్‌దీప్‌ 0, అభిషేక్‌ (సి)మ్యాక్స్‌వెల్‌ (బి)షమీ 12, రషీద్‌ఖాన్‌ 0 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 201/6; వికెట్ల పతనం: 1-160, 2-160, 3-161, 4-173, 5-175, 6-199; బౌలింగ్‌: కాట్రెల్‌ 3-0-33-0, రెహమాన్‌ 4-0-39-0, షమీ 4-0-40-1, మ్యాక్స్‌వెల్‌ 2-0-26-0, బిష్ణోయ్‌ 3-0-29-3, అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-33-2.

పంజాబ్‌: రాహుల్‌(సి)విలియమ్సన్‌(బ)అభిషేక్‌ 11, మయాంక్‌ (రనౌట్‌) 9, ప్రభుసిమ్రన్‌ సింగ్‌(సి)గార్గ్‌(బి)అహ్మద్‌ 11, పూరన్‌ (సి)నటరాజన్‌(బి)రషీద్‌ 77, మ్యాక్స్‌వెల్‌ రనౌట్‌ 7, మణ్‌దీప్‌(బి)రషీద్‌ 6, బిష్ణోయ్‌ 6 నాటౌట్‌, షమీ(ఎల్బీ)రషీద్‌ 0, కాట్రెల్‌

(బి)నటరాజన్‌ 0, అర్ష్‌దీప్‌సింగ్‌(సి)వార్నర్‌(బి)నటరాజన్‌ 0;  ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 16.5 ఓవర్లలో 132 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-11, 2-31, 3-58, 4-105, 5-115, 6-126, 7-126, 8-126, 9-132; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-27-0, అహ్మద్‌ 3-0-24-2, నటరాజన్‌ 3.5-0-24-2, అభిషేక్‌ 1-0-15-1, రషీద్‌ఖాన్‌ 4-1-12-3, సమద్‌ 1-0-28-0.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat