తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం వెంగళరావునగర్ డివిజన్‌లోని రహ్మత్‌నగర్‌లో ఆయన పర్యటించారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 58, 59 జీవోల గురించి ఇంటింటికీ తిరిగుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అవగాహన కల్పించారు. జీవోల పై వారు అడిగే సందేహాలను నివృత్తి చేశారు. 125 గజాల వరకు …
Read More »ఆర్‌ఆర్‌ఆర్ నటులకు 14 రోజుల క్వారంటైన్!
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా దెబ్బతో ఆగిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షెడ్యూల్స్ కొవిడ్ 19 వల్ల తల్లకిందులయ్యాయి. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమవుతుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌కు …
Read More »ఏపీ సీఎం జగన్ మామ మృతి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామ, వైఎస్ భారతి తండ్రి, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం పులివెందులకు తీసుకురానున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు. అలాగే 11 గంటలకు ముఖ్యమంత్రి కూడా పులివెందులకు వెళ్లనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స …
Read More »మళ్లీ కాంగ్రెస్ లో చేరతా -మాజీ ఎంపీ
‘నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక చేసిన పోరాటం చూస్తుంటే ఇందిరాగాంధీ రోజులు గుర్తుకొస్తున్నాయి. దేశంలో పేద, దళిత, మైనారిటీ ప్రజలకు అండగా ఉండేది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హీరోలా 120 కిలోమీటర్ల దూరం నడిచి …
Read More »తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2009 పాజిటివ్‌లు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. గురువారం 54,098 నమూనాలు పరీక్షించగా.. 2009 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,95,609కు చేరింది. 2,437 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకూ మొత్తం 1,65,844 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లో 293, కరీంనగర్‌లో 114, ఖమ్మం 104, మేడ్చల్ 173, నల్గొండ 109, రంగారెడ్డి …
Read More »అక్టోబర్ 15నుండి సినిమా హాల్స్ కు అనుమతి
దేశంలో అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులను తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతినిచ్చింది. అయితే.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. సినిమా థియేటర్లలో, మల్టీప్లెక్స్‌లలో 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. విద్యా సంస్థలు ఎప్పుడు తెరవాలన్న దానిపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్రాలు విద్యాసంస్థలు తెరవడంపై, విద్యార్థుల …
Read More »అద్భుత ఫీచర్లతో ఎంఐ నుండి సరికొత్త మొబైల్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో, ఎంఐ 10టీ లైట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఎంఐ 10టీ ఫోన్ రూ.43,000, 8జీబీ ర్యామ్, 128జీబీ మోడల్ ఫోన్ రూ. 47,200 గా ఉంది. ఎంఐ 10టీ ప్రో రూ. …
Read More »తెలంగాణలో కొత్తగా 2,072కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,072 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో 9 మంది మృతి చెందారు. తాజాగా 2,259 మంది కోలుకున్నారు. 29,447 యాక్టివ్ కేసులకు గాను 23,934 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో 283 నమోదవగా, కరీంనగర్‌లో 109, ఖమ్మంలో 92, మేడ్చల్‌లో 160, నల్లగొండలో 139, రంగారెడ్డిలో 161, వరంగల్ అర్బన్‌లో 85, సిద్దిపేటలో 78, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రో.నాగేశ్వరరావు
తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రొ. నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రొ. నాగేశ్వరరావు పోటీచేసి గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
Read More »ఆ రోజుతో నా జీవితం మారింది
దాదాపు దశాబ్దం పాటు తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందింది చెన్నై చిన్నది త్రిష. రెండు భాషలకు చెందిన అగ్ర హీరోలందరితోనూ పనిచేసింది. సినిమాల్లోకి రాకముందు త్రిష `మిస్ చెన్నై`గా నిలిచింది. 21 ఏళ్ల క్రితం ఇదే రోజున త్రిష ఆ టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆ సందర్భాన్ని త్రిష ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుర్తు చేసుకుంది. `మిస్ చెన్నై`గా నిలిచినప్పటి ఫొటోను షేర్ చేసింది. `30-09-1999.. ఆ …
Read More »