Home / MOVIES / ఆర్‌ఆర్‌ఆర్‌ నటులకు 14 రోజుల క్వారంటైన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ నటులకు 14 రోజుల క్వారంటైన్‌!

ప్రపంచాన్ని గడగడలాడించిన  కరోనా దెబ్బతో ఆగిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షెడ్యూల్స్‌ కొవిడ్‌ 19 వల్ల తల్లకిందులయ్యాయి.

ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్‌ మరింత ఆలస్యమవుతుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

షూటింగ్‌ సమయంలో ఉపయోగించే సామాగ్రిని ప్రత్యేకంగా శానిటైజేషన్‌ చేయించటం… థర్మల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కేవలం శానిటైజేషన్‌ మాత్రమే కాకుండా ఈ నెల 10వ తేదీ నుంచి సినిమా నటులందరూ హోటల్స్‌లో క్వారంటైన్‌లో ఉంటారు..

ఆ తర్వాత షూటింగ్‌ ప్రారంభమవుతుందని సినీ వర్గాల సమాచారం. ఈ షెడ్యూల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటారని తెలిసింది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat