Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 2,072కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,072కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2,072 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో 9 మంది మృతి చెందారు. తాజాగా 2,259 మంది కోలుకున్నారు. 29,447 యాక్టివ్‌ కేసులకు గాను 23,934 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

కొత్త కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 283 నమోదవగా, కరీంనగర్‌లో 109, ఖమ్మంలో 92, మేడ్చల్‌లో 160, నల్లగొండలో 139, రంగారెడ్డిలో 161, వరంగల్‌ అర్బన్‌లో 85, సిద్దిపేటలో 78, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 85 వచ్చాయి.

కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,89,283కు చేరింది. ఇప్పటివరకు 1,116 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,58,690 మంది కోలుకున్నారు. సోమవారం 54,308 పరీక్షలు చేశారు. మొత్తం పరీక్షల సంఖ్య 2,94,0642 చేరుకుంది.

ప్రతి పది లక్షల మందికి టెస్టుల సంఖ్య 79,206గా ఉంది. రంగారెడ్డి జిల్లా నందిగామ తహసీల్దార్‌ సయ్యద్‌ హైదర్‌ అలీ కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు