అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపు ఇచ్చారు. బేగంపేటలోని మానస సరోవర్ హోటల్‌లో మహావీర్, జితో అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జితో కొవిడ్ కేర్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. 100 పడకల ఈ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కరోనా రోగులకు సహనం, మానవత్వంతో చికిత్సలు అందించాలని సెంటర్‌లోని వైద్యులకు, నర్సులకు సూచించారు. ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడంలో జైనుల సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. …
Read More »సోనూ సూద్ బాటలో సుకుమార్
కరోనా సమయంలో మానవత్వం ఉన్న మనిషిగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు ఇప్పుడు ప్రతిచోటా మారుమోగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడందరూ సోనూసూద్‌ని రియల్ హీరోగా చూస్తున్నారు. ఇప్పుడాయన ఎందరికో స్ఫూర్తి నింపుతున్నారు. ముగ్గురు అనాథల కథనం సోనూసూద్ వరకు వెళ్లడం, ఆయన వారి బాధ్యత తీసుకుంటానని చెప్పడం తెలిసిన విషయాలే. అయితే నిర్మాత దిల్ రాజు ఆ ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని …
Read More »మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా పనిచేశారు. ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »వంగపండు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాశారు.. రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »బర్త్ డే రోజు మెగా ఫ్యాన్స్ కు శుభవార్త
ఆగస్ట్ నెల ప్రారంభమైందంటే చాలు మెగాభిమానులకు పండగే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఈ నెలలోనే ఉంటుంది. ఆగస్ట్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే. అందుకే మెగాభిమానులకు ఈ నెల అంటే ఎంతో ఇష్టం. ఇక 10 రోజుల ముందు నుంచే మెగాస్టార్ బర్త్‌డే వేడుకలను స్టార్ట్ చేసి, రోజుకో కార్యక్రమం చొప్పున అభిమానులు సంబరాలు జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం పరిస్థితులు అంతగా సహకరించకపోయినా.. అభిమానులు మాత్రం …
Read More »తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం…
కరోనా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేసింది. ఇప్పటికే ఈ ఆస్పత్రికి సంబంధించిన పలు సంఘటనలు వెలుగు చూశాయి. అయితే ఇలా పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ ఆస్పత్రి యాజమాన్యానికి కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. కరోనా వైద్యం అనుమతి రద్దు.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి …
Read More »జిమ్‌లు , యోగా సెంటర్లకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన విధి విధానాలు జిమ్‌లు, యోగా కేంద్రాలు …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. అలాగే డ్రైవర్‌కు, ఇద్దరు గన్‌మెన్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
Read More »కర్ణాటక సీఎం కుమార్తెకు కరోనా
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కుమార్తెకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. కరోనా సోకిన సీఎం కుమార్తెను ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యెడియూరప్పకు కరోనా సోకడంతో గత రెండు వారాలుగా హోంక్వారంటైన్ లో ఉన్నారు. దీంతో సీఎం అధికారిక నివాసంలోని ఉద్యోగులతోపాటు సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్ అని తేలింది.
Read More »మంత్రి హారీష్ రావుకు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళ నేతలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్‌రావుని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో కలిసి టీఆర్‌ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. రాష్ట్ర ప్రజలకు హరీష్‌రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని హరీష్‌రావు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆత్మీయ రక్ష బంధన్‌తో పాటు, స్వీయ రక్షణ పాటించాలని హరీష్‌రావు సూచించారు.
Read More »