Home / SLIDER / టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా పాజిటీవ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు.

అలాగే డ్రైవర్‌కు, ఇద్దరు గన్‌మెన్లకు కూడా కరోనా ‌పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నారదాసు లక్ష్మణ్ కుటుంబం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు.