మహారాష్ట్రలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలోనినమోదవుతున్నాయి.. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.ఇప్పటివరకు ఈ సంఖ్య 3లక్షల 75వేలు దాటాయి. అటు ఆదివారం ఒక్కరోజే 9,431కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 6,986, కర్ణాటకలో 5,199 కరోనా కేసులు నమోదయ్యాయి
Read More »ఆ డైరెక్టర్ దర్శకత్వంలో బన్నీ
మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘సైరా’ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. అల్లు అర్జున్ కోసం కథను సిద్ధంచేస్తున్నాడని టాక్. స్టైలిష్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సురేందర్ రెడ్డి అంతా సిద్ధం చేసుకుంటున్నాడని టాలీవుడ్ టాక్. కాగా సైరా తర్వాత ఏ సినిమా చేయని సురేందర్ రెడ్డి.. బన్నీని దృష్టిలో పెట్టుకొనే కథను సిద్ధం చేస్తున్నాడని, ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని సినీ జనాలు అనుకుంటున్నారట.
Read More »81%మందికి లక్షణాల్లేవు
కరోనా లక్షణాలు లేని వారి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నట్లు TS ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. TSలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. WHO, ICMR సలహాలు నిబంధనలు పాటిస్తున్నట్లు తెలిపారు. 81% మందికి కరోనా సోకినట్లు తెలియడం లేదన్నారు. కరోనా బారిన పడిన వారికి రూ.వెయ్యి కూడా ఖర్చవదని కానీ పరిస్థితి విషమించినప్పుడే ఖర్చవుతుందన్నారు.
Read More »కరివేపాకుతో లాభాలెన్నో
బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది శరీరం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది నిమోనియా, ఫ్లూలాంటి వాటి నుండి రక్షణనిస్తుంది విరేచనాలు, మలబద్దకాన్ని నివారిస్తుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది కంటిచూపును మెరుగుపరుస్తుంది
Read More »కరోనా కేసుల్లో ఏపీ నెంబర్ 4
దేశంలో ఆదివారం దాకా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.. ఈ జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. నిన్నటి వరకు 96,298 కరోనా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. కాగా ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ఏపీ నాలుగో స్థానానికి చేరింది..
Read More »జ్వరమోస్తే కరోనా వచ్చినట్లా..?
కరోనా లక్షణాల్లో ప్రధానంగా జ్వరం కనిపించడం లేదు తాజాగా కరోనా రోగుల మీద జరిపిన పరిశోధనలో.. జ్వరం కరోనా మెయిన్ లక్షణం కాదని తేలింది. కేవలం 17% మందిలో మాత్రమే జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. 34.7% మందిలో మాత్రం దగ్గు కనిపిస్తున్నట్లు తేలింది . అటు ఎలాంటి లక్షణాలు లేనివాళ్లు 44.7% ఉంది. జలుబు లక్షణం కనిపిస్తున్న వాళ్లు 2% ఉన్నట్లు ఎయిమ్స్ స్టడీలో తేలింది.
Read More »అందులో తెలంగాణ నెంబర్ 2
దేశంలో కరోనా వైరస్ బారి నుండి కోలుకుంటున్న వారి జాబితాలో తెలంగాణ నుండి ఎక్కువ మందిఉంటున్నారు. దేశంలో ఢిల్లీకి చెందిన వారు ఎక్కువగా రేట్ ఉండగా.. తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా మరణాల విషయంలో మొదటి పది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు.కరోనా నుండి కోలుకుంటుండగా.. రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఢిల్లీలో 87.29% రికవరీ ఉంది.తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా …
Read More »కరోనా నుండి కోటి మందికి విమూక్తి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.
Read More »దేశంలో 14లక్షల కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,4534 కు చేరింది. ఇందులో 4,85,114 మంది చికిత్స తీసుకుంటున్నారు. 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 24 గంటల్లో 708 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 32,771కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా …
Read More »మొక్కలు నాటిన నరేష్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా సినీ దర్శకులు సతీష్ వేగేశ్న విసిరిన చాలెంజ్ స్వీకరించి నానక్ రాం గూడ లో తన నివాస ప్రాంగణం విజయ కృష్ణ ఎస్టేట్ లో మొక్కలు నాటిన సీనియర్ నటులు, మా అధ్యక్షుడు నరేష్ విజయకృష్ణ.. కాంక్రీట్ ఇండియా తో పాటు గ్రీన్ ఇండియా తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి …
Read More »