ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇందులో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న ప్రస్తుత భద్రతను ఉపసంహరించుకుంది. భద్రతలో భాగంగా పయ్యావుల కేశవ్ కు ఉన్న గన్‌మెన్లు వెనక్కి రావాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. ఎమ్మెల్యేల ఫోన్లను వైసీపీ ట్యాపింగ్ చేస్తున్నారని ఇటీవల …
Read More »అవే నాకు శాశ్వత అనుబంధాలు: జగన్ ట్వీట్
రెండు రోజులపాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు దీనికి హాజరై విజయవంతం చేశారు. నేతల ఉత్సాహపరిచే స్పీచ్‌లతో ప్లీనరీ ప్రాంగణం హోరెత్తిపోయింది. ప్లీనరీ విజయవంతమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కార్యకర్తలకు మరోసారి సెల్యూట్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నిరంతరం దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల …
Read More »ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు..!
ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులు నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన పలువురు నేతలు మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని.. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’పై ప్రవేశపెట్టిన తీర్మానంపై నేతలు మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలంటే మూడు రాజధానులు ఉండాలని.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఎంపీ నందిగం …
Read More »వైఎస్సార్ ఫ్యామిలీ.. ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
తన మార్క్ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఎప్పుడూ ప్రజల బాగోగుల కోసమే తపించే ఆయన.. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేవారు. అప్పుడప్పుడూ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్, మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా విహారయాత్రలకూ వెళ్లేవారు. ఇటీవల వైఎస్ జయంతి సందర్భంగా ఆయన తన కుటుంబంతో గడిపిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో …
Read More »వైసీపీ ప్లీనరీకి పోటెత్తిన జగన్ సైన్యం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్
వైసీపీ ప్లీనరీకి కార్యకర్తలు పోటెత్తారు. గుంటూరు జిల్లా చినకాకాని సమీపంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు ఏపీ నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ముగిసిన అనంతరం కార్యకర్తలు తమ స్వస్థలాలకు బయల్దేరడంతో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చెన్నై-కోల్‌కతా హైవేలో సందడి వాతావరణం కనిపించింది. ‘జై జగన్’ ‘జై …
Read More »దేవుడు స్క్రిప్ట్ గొప్పగా రాస్తాడు: ప్లీనరీలో జగన్
అప్పట్లో తనపై శక్తివంతమైన వ్యవస్థలతో కాంగ్రెస్, టీడీపీ దాడి చేశాయని వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్నారు. ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి చేశాయని చెప్పారు. వైసీపీ ప్లీనరీ ముగింపు సందర్భంగా కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. మనకి అన్యాయం చేసిన పార్టీలకు రాష్ట్రంలో నామరూపాల్లేవన్నారు. 2014లో ఓడినా తనపై కుట్రలు, కుతంత్రాలు ఆపలేదని.. 23 మంది ఎమ్మెల్యేలు, 3 మంది ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు. దేవుడు స్క్రిప్ట్ …
Read More »వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్..
వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికయ్యారు. వైసీపీ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు తనపై కార్యకర్తలు, అభిమానులు ఆప్యాయత చూపించి అనురాగం పంచుతున్నారని చెప్పారు. ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోందన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విధానాలు, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు నిండు మను సెల్యూట్ చేస్తున్నట్లు …
Read More »వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ YSవిజయమ్మ ప్రకటించారు. గుంటూరు జిల్లా చినకాకానిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీకి ఆమె హాజరై మాట్లాడారు. తమ కుటుంబంతో ప్రజల అనుబంధం 45 ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతి మనిషినీ ప్రేమించారన్నారు. తమ కుటుంబ అనుబంధం, సంస్కారం గొప్పవని చెప్పారు. తామే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలే ఓదార్చారన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నానని.. బిడ్డ షర్మిలకు …
Read More »గుడ్ న్యూస్: రేట్ తగ్గిన వంట నూనె.. అమల్లోకి ఎప్పుడంటే!
సామాన్యులకు కేంద్రం తీపికబురు చెప్పింది. వంట నూనె రేటును లీటరుకు రూ.15 తగ్గించింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తగ్గిన ధరల ప్రయోజనాన్ని వెంటనే ప్రజలకు అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్రం ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం మేరకు పామాయిల్, సోయాబీన్, రైస్ బ్రాన్ ఆయిల్ రేట్లను 5 నుంచి 11 శాతం తగ్గించింది.
Read More »సామాన్యులకు షాక్: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ రేటు
సామాన్యులకు బ్యాడ్ న్యూస్. మరోసారి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరింది. నిత్యం ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచాయి చమురు సంస్థలు. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ఈ రోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి
Read More »