ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో బాబును ఎలాగైనా ఓడించాలని అధికార వైసీపీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది అని ఆ రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అందులో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రత్యర్థిగా తమిళ స్టార్ విశాల్ ను బరిలోకి దించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అతడి తండ్రి కృష్ణారెడ్డి తెలుగువారు కావడంతో విశాల్ కు ఏపీలో మంచి …
Read More »ఆత్మకూరు బైపోల్.. వైసీపీకి తిరుగులేని విజయం
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. గౌతమ్‌రెడ్డి సోదరుడు, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా ప్రతి రౌండ్‌లోనూ విక్రమే ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చి చివరకు ఘన విజయం సాధించారు. ఈనెల 24న జరిగిన …
Read More »ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు- ఆధిక్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఏపీలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 10వ రౌండ్ ఫలితాలు : వైసీపీ అభ్యర్థి …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీలోని కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పీఆర్సీ జీవోలో మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. దీంతోపాటు విద్యాకానుక, వాహనమిత్ర, జగనన్నతోడు, కాపు నేస్తం సంక్షేమ పథకాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. వంశధార …
Read More »రాష్ట్రపతి ఎన్నికలు -YSRCP సంచలన నిర్ణయం
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్మూకు ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ శుక్రవారం వైసీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న పార్టీకి మద్దతు ఇస్తామని వెల్లడించారు.
Read More »ఏపీలో కరోనా కలవరం
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి చెందిన ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలోని 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు విద్యార్థులను ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈనెల 18 నుంచి పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 317 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో క్యాంపు నిర్వహిస్తున్నారు.వీరు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు 40 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు …
Read More »మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్‌ని చూసి కాన్వాయ్ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్‌ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు. మహేష్‌కి 2019లో యాక్సిడెంట్ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో …
Read More »ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ Update – 24.92శాతం పోలింగ్
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యమైన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల వరకు 24.92శాతం వరకు పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో తన తల్లి …
Read More »అమ్మ ఒడి పథకంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంలో కోతలు విధించిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. విద్యార్థులు అర్ధాంతరంగా బడి మానేయకుండా అమ్మ ఒడిని ప్రారంభించిందని మరోసారి స్పష్టం చేశారు. విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి బొత్స నారాయణ మాట్లాడుతూ 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడిని ఇస్తున్నామని పేర్కొన్నారు.ఇందులో నుంచి …
Read More »టీడీపీకి ఏపీలోనూ తెలంగాణ పరిస్థితే..: దివ్యవాణి
తెలంగాణలో టీడీపీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందని సినీనటి దివ్యవాణి అన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చాక కొంతమంది పనికిమాలిన చెత్తవెదవలు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకోసం కష్టపడినా గుర్తింపు లేకపోవడంతోనే బయటకు వచ్చేశానన్నారు. టీడీ జనార్దన్ కోవర్టులతో తప్పులు చేయిస్తున్నారని.. నిజాయితీగా ఉండబట్టే అందరి ఆధారాలు బయటపెడుతున్నానని దివ్యవాణి అన్నారు. పార్టీకోసం నిజాయితీగా పనిచేసినా తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More »