Home / ANDHRAPRADESH / కుప్పంలో బాబుకు ప్రత్యర్థిగా స్టార్ హీరో..?

కుప్పంలో బాబుకు ప్రత్యర్థిగా స్టార్ హీరో..?

ఏపీలో  వచ్చే సార్వత్రిక  ఎన్నికల్లో మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న  కుప్పంలో  బాబును  ఎలాగైనా ఓడించాలని అధికార వైసీపీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది అని ఆ రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి.

అందులో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు  ప్రత్యర్థిగా తమిళ స్టార్ విశాల్ ను బరిలోకి దించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అతడి తండ్రి కృష్ణారెడ్డి తెలుగువారు కావడంతో విశాల్ కు ఏపీలో మంచి సంబంధాలున్నాయి.

అతడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా  ప్రస్తుత సీఎం ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాను వీరాభిమానినంటూ గతంలో పలుమార్లు చెప్పాడు. మరి దీనిపై విశాల్ ,వైసీపీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar