ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు దావోస్ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. ఆయన ఇవాళ రాత్రి దావోస్ చేరుకొంటారు. పర్యటనలో భాగంగా 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రు లు, అధికారులతో పాటు జగన్ పాల్గొనన్నారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు, డీజీపీ సీఎం …
Read More »ప్రజలకు ఏం చేశామో బస్సు యాత్రలో చెప్తాం: ధర్మాన
దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందిస్తున్న ప్రభుత్వం తమదని వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులు వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘సామాజిక న్యాయం’ అనే పేరుతో …
Read More »వైసీపీ రాజ్యసభ టికెట్లు ఫైనల్.. అభ్యర్థులు వీళ్లే..
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం కల్పించారు. అనూహ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను వైసీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్‌రెడ్డికి ఆ పార్టీకి అధినేత, సీఎం జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం …
Read More »AP BJPకి షాక్
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నానని, పార్టీ నేతలు అన్యథా భావించవద్దని ఆయన తన రాజీనామా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న రావెల… కొన్ని నెలల …
Read More »జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్‌పై చంద్రబాబు ఆగ్రహం
సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రజాదర్భార్ నిర్వహించగా.. అక్కడికి జూనియర్‌ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత, ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి వెళ్లాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ.. చంద్రబాబుకు శివ గురించి చెప్పాడు. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ …
Read More »పవనే తమ వెంట పడుతున్నాడని అమిత్‌షా చెప్పారు: కేఏ పాల్
వచ్చే ఎన్నికల్లో 175 లోక్‌సభ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పాల్.. గురువారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని.. అపోజిషన్ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అమిత్‌షాతో చర్చించినట్లు పాల్ తెలిపారు. …
Read More »చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి పరుగెత్తాడు: జగన్ ఎద్దేవా
ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి లేదని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతాడన్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం మంగళగిరిలో ఓడిపోయిన సొంతపుత్రుడు.. రెండు చోట్లా పోటీ చేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడిని నమ్ముకుని వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కోనసీమ జిల్లా మురమళ్లలో వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన …
Read More »AP నుండి రాజ్య సభ అభ్యర్థులు వీళ్ళేనా..?
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయించారని ఏపీ రాజకీయాల్లో విన్పిస్తున్న వార్తలు. అంతేకాకుండా వైసీపీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్‌ను ప్రారంభించి గోదావరి, కృష్ణా వాటర్‌ను ముందే విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల నవంబర్‌లో తుపాను వచ్చే నాటికి పంట చేతికి వస్తుందని మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేసి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. గోదావరి డెల్టాకు …
Read More »పెళ్లిపీటలపై కళ్లు తిరిగిపడిపోయి.. ఆపై చనిపోయిన వధువు
ఓ పెళ్లి వేడుకలో పీటలపైనే పెళ్లికుమార్తె కళ్లు తిరిగిపడిపోయి ఆపై మృతిచెందిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాజీ అనే యువకుడికి సృజన అనే యువతితో బుధవారం మధురవాడలో పెళ్లికి నిర్ణయించారు. పెళ్లి పీటలపై సరిగ్గా జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో సృజన ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం సృజన చనిపోయింది. …
Read More »