Home / INTERNATIONAL (page 12)

INTERNATIONAL

ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి-WHO

ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రాథమిక ఆధారాల మేరకు.. దీని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. సభ్య దేశాలకు అప్రమత్తత లేఖలు జారీ చేసింది. ఇది ప్రపంచమంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను కలిసికట్టుగా పోరాడేందుకు సభ్యదేశాలు ఓ ఒప్పందం చేసుకోవాలని సూచించింది.

Read More »

కెనడాలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌

ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్‌ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా నుంచి ఒంటారియోకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో సరికొత్త వైరస్‌ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఈ మధ్యకాలంలో వారు కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ఆరోగ్యశాఖ మంత్రి జీన్‌ వెస్‌ తెలిపారు. మానిటరింగ్‌, టెస్టింగ్‌ ప్రక్రియ …

Read More »

కొత్త వేరియంట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కొత్త వేరియంట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి కొన్ని దేశాల్లో అత్యంత ప్రమాదకరమైన ఒమిన్ అనే కొత్త కరోనా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని WHO సూచించింది. 1. పండుగలు, ఇతర వేడుకలు కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహణ 2. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు జనసమూహాలకు దూరంగా ఉండటం. 3. ప్రభుత్వాలు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేలా చూడటం. 4. వైరస్ వ్యాప్తికి …

Read More »

నేటినుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ పునఃప్రారంభం

పాకిస్తాన్ లో సిక్కుల పవిత్ర క్షేత్రం కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. 2019 తర్వాత సిక్కుల కోసం పాకిస్తాన్ సరిహద్దులను భారత్ తెరవబోతుంది. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ఈనెల 17వ తేదీ నుంచి బుధవారం నుంచి తిరిగి తెరుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి సిక్కులకు పవిత్ర దర్శనం కల్పించనున్నారు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా …

Read More »

చైనాలో కరోనా మళ్లీ పంజా

రష్యా, జర్మనీతోపాటు చైనాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చైనాలోని అత్యధిక రాష్ట్రాల్లో వందలమంది కరోనాబారిన పడ్డారు. ఇక తొలికేసు వెలుగుచూసిన వుహాన్ నగరంలో గతంలో కంటే ఇప్పుడే అధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. మరోవైపు రష్యాలో నిత్యం 1,100కు పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

Read More »

పారిస్‌ లో మంత్రి కేటీఆర్ Busy Busy

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు బుధవారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌కు బయలుదేరివెళ్లారు. ఈ నెల 29వ తేదీన ఫ్రాన్స్‌ ఎగువ సభలో (సెనేట్‌) జరిగే ‘యాంబిషన్‌ ఇండియా-2021’ సదస్సులో పాల్గొంటారు. ‘గ్రోత్‌-డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా (కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. …

Read More »

పెరూలో కోవిడ్ వ‌ల్ల రెండు ల‌క్ష‌లు మంది మృతి

 లాటిన్ దేశం పెరూలో కోవిడ్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆ దేశంలో కొత్త‌గా 25 మంది మ‌ర‌ణించారు. దీంతో ద‌క్షిణ అమెరికా దేశ‌మైన పెరూలో మృతుల సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటింది. మార్చి 2020 నుంచి ఆ దేశం క‌రోనా మ‌ర‌ణాల‌ను లెక్కిస్తున్న‌ది. ఆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 22 …

Read More »

బ్రిటన్‌లో మళ్లీ కరోనా దూకుడు

బ్రిటన్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో గత ఎనిమిది రోజులుగా 40 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 52 వేలు దాటింది. యూకేలో గురువారం కొత్తగా 52,009 మంది కరోనా బారినపడ్డారు. మరో 115 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సఖ్య 86,41,221కి చేరగా, 1,39,146 మంది మృతిచెందారు. కాగా, దేశంలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయని, పరిస్థితిని నిషితంగా గమనిస్తున్నామని బ్రిటన్‌ …

Read More »

london లో ఘనంగా చేనేత బతుకమ్మ-దసరా సంబురాలు

తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (టాక్‌) ఆధ్వర్యంలో లండన్‌లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్‌స్లో మేయర్‌ బిష్ణు గురుగ్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- …

Read More »

మలేరియా వ్యాక్సిన్‌కు WHO ఆమోదం

పిల్లల్లో ప్రాణాంతకంగా పరిణమించిన మలేరియాను నిర్మూలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విశేషంగా కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్‌ (ఆర్టీఎస్‌, ఎస్‌/ఏఎస్‌01) కు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ను మలేరియా ఎక్కువగా ప్రభావితమైన ఆఫ్రికన్ దేశాల నుంచి ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇది సక్సెస్‌ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి పెట్టనున్నది. తద్వారా ఈ టీకా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat