భారత్‌లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ ( Corona Positive )కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సుమారు 39,486 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,19,551గా ఉంది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,35,110గా ఉంది. వ్యాక్సినేషన్ రిపోర్ట్‌ను …
Read More »వాట్సాప్ లో ఇక నుండి వ్యాక్సినేషన్ బుకింగ్
వ్యాక్సినేషన్ బుకింగ్ ( Vaccine Booking )పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పౌరుల సౌలభ్యం కోసం మొబైల్ ఫోన్లలో ఉండే వాట్సాప్ ద్వారానే టీకా స్టాట్‌లు బుక్ చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఓ ట్వీట్ చేశారు. ఈ విధానం వల్ల టీకా రిజిస్ట్రేషన్ మరింత సులువుగా మారనున్నది. వాట్సాప్ ద్వారా టీకా బుక్ చేసుకునే పద్ధతి …
Read More »ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పర్యటన
ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం భద్రంగా ఉందని నడ్డా పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హయాంలో ఇప్పటివరకూ రూ 1.35 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు.డెహ్రాడూన్, రైవాలలో మాజీ సైనికులతో నడ్డా ముచ్చటించారు. వాజ్‌పేయి …
Read More »దేశంలో కొత్తగా 34,457 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి చేరిందని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 375 మంది మరణించారని వెల్లడించింది. కాగా, శుక్రవారం 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా వాటి సంఖ్య 34 వేలకు తగ్గింది. దీంతో …
Read More »దేశంలో కొత్తగా 36,571 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 3.4శాతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 530 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,080 మంది …
Read More »అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ వల్ల ఇప్పటికే అమెరికాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని, గత నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 286శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మరణాల్లో కూడా రికార్డు స్థాయి పెరుగుదల కనిపించింది. గడిచిన నెలరోజుల్లో కరోనా మరణాల్లో 146శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు తాజాగా …
Read More »దేశంలో కొత్తగా 36,401 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 530 మంది బాధితులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,64,129 ఉన్నాయని చెప్పింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 4,33,049 …
Read More »తాలిబన్ల అరాచకం – ఇక మహిళలు సెక్స్ బానిసలుగా మగ్గుతారు!
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఇక అక్కడి మహిళలు ఇండ్లలో సెక్స్ బానిసలుగా మగ్గాల్సిందేనని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబూల్‌లోని గోడపై మహిళ చిత్రాన్ని ఓ వ్యక్తి చెరిపేస్తున్న ట్విటర్ ఫోటోపై కామెంట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు మహిళలను ఎక్కడా కనిపించకుండా చేస్తారని..మహిళలు ఇండ్లలోనే సెక్స్ బానిసలుగా మగ్గిపోతూ పిల్లల్ని కనే యంత్రాలుగా ఉండాలని వారు భావిస్తారని అన్నారు. ఇస్లాం …
Read More »దేశంలో కొత్తగా 25,166 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 25,166 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 154 రోజుల తర్వాత అతి తక్కువగా కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజాగా 36,830 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 437 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679కు …
Read More »కాంగ్రెస్ పార్టీకి షాక్
కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్ ఇండియా మహిళా …
Read More »