మహరాష్ట్రలో శివసేన నేత సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాక్రేకు అందించిన రాథోడ్.. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. కాగా టిక్ టాక్ స్టార్, మోడల్ పూజా చౌహాన్ ఆత్మహత్యకు సంజయ్ కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆయన రాజీనామా చేశారు.
Read More »2జీ, 3జీ, 4జీ లకు సరికొత్త నిర్వచనం చెప్పిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు
Read More »జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకోస్తారా..?
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే… ధరలు నియంత్రణలోకి వస్తాయనే వాదన ఉంది. దీనిపై స్పందించారు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్.. ‘ఈ ప్రతిపాదనకు నేను మద్దతిస్తున్నా. దీనిపై నిర్ణయాధికారం జీఎస్టీ కౌన్సిల్ దే’ అని అన్నారు త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇది రాజకీయాంశంగానూ మారగా.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఆసక్తిగా మారింది
Read More »రామ మందిరానికి విరాళాలు ఎన్నో వచ్చాయో తెలుసా..?
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం విరాళల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలు సేకరించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వరకూ విరాళాలు వచ్చినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో ఇంకా చాలా వరకు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే.. విరాళాల మొత్తం మరింత …
Read More »Big Breaking News-25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నట్లు కన్పిస్తుంది. ఎక్కడ చూసిన కానీ కరోనా పాజీటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న వార్తలను వింటున్నాం. తాజాగా ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని బుర్లాలోని వీర్ సురేంద్రసాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (వీఎస్‌ఎస్‌యూటీ)కి చెందిన 25 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. బాధిత విద్యార్థులంతా ఒకే హాస్టల్‌కు చెందిన వారని, వారిని చికిత్స కోసం బుర్లా వీర్ సురేంద్ర సాయి ఇస్టిట్యూట్ ఆఫ్ …
Read More »4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ
నాలుగు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ ఆరోరా ఆయా రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 …
Read More »దేశంలో కొత్తగా 16,577 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491కు చేరింది. ఇక నిన్న 120 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,56,825కు పెరిగింది. గురువారం రోజు 12,179 మంది కోలుకోగా దేశంలో ప్రస్తుతం 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »పాక్ కు షాక్
ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాన్ని గ్రే లిస్టులో కొనసాగిస్తున్నట్లు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) వెల్లడించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ ను తనిఖీ చేయడంలో పాక్ విఫలమైందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సమర్థవంతమైన వ్యవస్థ లేదని ఉగ్రవాదుల మనీ లాండరింగ్ వ్యవహారం తనిఖీ చేయడంలో పాక్ నుంచి తీవ్రమైన లోపాలు ఉన్నాయని .FATF విమర్శించింది.
Read More »సబ్సిడీ సిలిండర్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్
సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో సిలిండర్(14 కేజీల) ధర రూ.846.50కు పెరిగింది. FEBలో మొత్తం మూడు సార్లు గ్యాస్ ధరలు పెరగ్గా.. రూ. 100 మేర భారం పడింది. 4వ తేదీన రూ. 25,15న రూ.50 సహా తాజాగా రూ.25 పెంచడంతో …
Read More »మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్దార్ వల్లభ్ భాయ్ పేరు తీసేసి మోదీ పేరు పెట్టడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. తాము మైదానానికి మాత్రమే మోదీ పేరు పెట్టామని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సర్దార్ పటేల్ పేరు కొనసాగుతుందని కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్ రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
Read More »