ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఒక్క ఫిబ్రవరి నెలలోనే వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25లు పెరగడం గమనార్హం. వీటి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరల …
Read More »మీకు తక్కువ ధరకు పెట్రోల్ కావాలా..?అయితే మీకోసం..?
ప్రస్తుతం మన దేశంలో పెట్రోలు వంద కొట్టింది. అయితే, తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాలు చూస్తే.. వెనిజులాలో లీటరు పెట్రోలు రూ. 1.45, అంగోలాలో ధర రూ. 17.77 అల్జీరియాలో రూ.25.32, కువైట్లో రూ.25.13 సూడాన్ లో రూ. 27.20, ఖజఖస్తాన్ లో రూ.29.62 ఉంది. మరోవైపు కతర్ లో రూ. 29.28, తుర్క్ మేనిస్తాన్లో రూ. 31.08 నైజీరియాలో రూ. 31.568గా ఉంది. ఇక మన పొరుగు …
Read More »దేశంలో కొత్తగా 10,584 కరోనా కేసులు
దేశంలో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన కరోనా పాజిటివ్ కేసులు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 10,584 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మరో 13,255 మంది కొత్తగా డిశ్చార్జి అవగా.. 78 మంది మరణించారని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది. 1,07,12,665 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు …
Read More »మధ్యప్రదేశ్ సీఎం సంచలన నిర్ణయం
వాతావరణ మార్పులు భూమికి ముప్పు గా పరిణామించాయి… పర్యావరణాన్ని పరిరక్షణ కు మనము నిర్మాణత్మక చర్యలు తీసుకోవాలిసన అవసరం ఉంది. నేను రోజు ఒక మొక్క నాటుతాను.. మీరు కనీసం సంవత్సరంలో ఒక మొక్క అయినా నాటాలి అని ప్రజలకుమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పిలుపునిచ్చారు.భోపాల్ లోని సెక్రటేరియట్ లో ఈరోజు మొక్క నాటారు. దేశ వ్యాప్తంగా వాతావరణ లో వస్తున్న మార్పుల పై తీవ్రంగా ఆలోచించాలిసిన అవసరం …
Read More »భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రం ఏదో తెలుసా..?
భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఆ స్టేట్లో సోమవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12 యాక్టివ్ కేసులే ఉన్నాయని స్పష్టం చేసింది, నాగాలాండ్లో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా గత శనివారం వరకు 21,481 మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు కేరళ, మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 14,199 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,50,055 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,99,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 83 మంది చనిపోగా, మొత్తం 1,56,385 కరోనా మరణాలు సంభవించాయి.
Read More »బీజేపీలోకి పీటీ ఉష
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న కేరళలో ప్రభావం చూపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఆకర్షించిన కాషాయ దళం ఇప్పుడు ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉషను తమ పార్టీలోకి చేర్చుకోనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా గళం విన్పించిన ఉష సహా పలువురు ప్రముఖులు త్వరలోనే బీజేపీలో చేరుతారని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Read More »మళ్లీ కరోనా గజగజ
హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే …
Read More »దేశంలో ఇప్పటికి 85లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు 85 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వచ్చే సైడ్ ఎఫెక్టులు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఒక్కరు కూడా మరణించలేదన్న ఆయన.. దేశంలో కరోనా రికవరీ రేటు కూడా 97.29%గా ఉందని, ప్రపంచంలో అత్యంత తక్కువ కరోనా మరణాల రేటు కూడా దేశంలోనే నమోదైందన్నారు. గత 7రోజుల్లో 188 జిల్లాల్లో ఒక్క కరోనా …
Read More »నా పార్టీలో చేరాలంటే రూ.25వేలు చెల్లించాలి-కమల్ హాసన్
విశ్వ విఖ్యాత సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. పార్టీ లో చేరాలనుకునే సభ్యులు 25 వేల రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఆయన సోమవారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేలో జరగనున్న ఎలక్షన్స్ కోసం …
Read More »