74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా …
Read More »భారత్‌లో 25 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 50 వేలకు చేరువగా మరణాల సంఖ్య చేరుకుంది. ప్రతిరోజు దాదాపు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 996 …
Read More »అంబానీ సంచలన నిర్ణయం
ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ …
Read More »మరో కేంద్ర మంత్రికి కరోనా
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంత్రులు, రాజకీయ నేతలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకగా, తాజాగా ఆయూష్ కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించిన ఆయన. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Read More »ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై తనయుడు స్పందన
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.. రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం.. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ప్రకటించింది.. ఇక, మెదడులో రక్తం గడ్డ …
Read More »తన భార్య మైనపు విగ్రహాంతో గృహాప్రవేశం
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన సతీమణి రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు. నచ్చేశారు గుప్తా గారు… భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం చూపించే మగానుభావులు, పొద్దున లేస్తే అర్థాంగి మీద కుళ్లు జోకులు వేస్తూ పలుచన చేసే భర్త గార్లు ఉన్న ఈ లోకంలో మీరు సమ్ థింగ్ స్పెషల్. …
Read More »మాజీ రాష్ట్రపతికి కరోనా
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుండగా, రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యపెరుగుతోంది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.. ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకగా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో ప్రణబ్ కి పాజిటివ్ అని తేలింది..
Read More »దేశంలో 22లక్షలు దాటిన కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,35,744 మంది కోలుకొని ఆస్పత్రుల …
Read More »ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
ఎయిర్ ఇండియా విమానానికి(IX-1344) ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద రాత్రి 7:45 నిమిషాలకు ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. విమానం రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 191 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. భారీ వర్షం …
Read More »20లక్షలు దాటిన కరోనా కేసులు!
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి. భారత్లో ఒక్కరోజులోనే 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13లక్షల 78వేల మంది కోలుకోగా, మరో 6లక్షల …
Read More »