సిద్ధాంతాలను గాలికి వదిలేసి తెలుగుదేశం- కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న పొత్తుపై ప్రధాని మోడీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న `మహాకూటమి`పై అది ఓ ‘అపవిత్ర కూటమి’గా అభివర్ణించారు. మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు, చెన్నై తూర్పు, ఉత్తర ప్రాంతాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల …
Read More »జీఎస్‌ఎల్వీ-ఎఫ్11 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్ యాంగ్రీ బర్డ్‌గా పిలుస్తున్న దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7ఏను బుధవారం సాయంత్రం విజయవంతంగా రోదసిలోకి పంపింది. శ్రీహరికోట లోని సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) లోని రెండవ ప్రయోగవేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జీశాట్-7ఏను తీసుకుని జీఎస్‌ఎల్వీ మార్క్-2 ఎఫ్-11 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 19 నిమిషాల వ్యవధిలోనే.. జీశాట్-7ఏ …
Read More »శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ట్రాన్స్‌జెండర్లు
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను కూడా అనుమతించాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 28న తీర్పు వెలువరించినా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇవాళ ట్రాన్స్‌జెండర్లు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. డిసెంబర్ 16వ తేదీన దర్శనం కోసం బయలుదేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు ఆందోళనకు దిగారు. ఆలయ ప్రధాన పూజారితో చర్చల అనంతరం ట్రాన్స్‌జెండర్లకు అనుమతి లభించింది. …
Read More »భగత్ సింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
భగత్ సింగ్ ఒక మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. విప్లవ పతాక.ఆయన పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అతి చిన్న వయసులోనే అంటే 23 ఏళ్ల వయసులోనే… స్వాతంత్ర్యం కోసం పోరాడి… ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. డల్లాస్ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జనలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ …
Read More »పెరుగుతున్న సైబర్‌నేరాల సంఖ్య ..అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరా చేసుకొని రెచ్చిపోతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉంటే తప్పించుకునే వీలున్నా.. అత్యాశ అనే ప్రధాన బలహీనత బాధితుల పాలిట శాపంగా మారుతున్నది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ.. మోసగాళ్లకు మరో అస్త్రంగా మారుతున్నది. సైబర్‌క్రైమ్‌లపై పోలీసులు, మీడియా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రజల …
Read More »గూగుల్ షాపింగ్ పోర్టల్ లాంచ్…దుస్తులు, ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తులు
మనదేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌నకు పెరుగుతున్న ఆదరణ చాల ఎక్కువే..ఏది కావాలనుకున్న సింపుల్ గా ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచేస్తునాయి.ఈ నేపథ్యంలో గూగుల్ కూడా ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే గూగుల్ అంటే సాఫ్టవేర్ లో రారాజు అని అందరికి తెలుసు అయితే ఇప్పుడు ‘గూగుల్ షాపింగ్’ పేరుతో కొత్త షాపింగ్ ప్లాట్‌ఫాంను గురువారం లాంచ్ చేసింది.. ఈ రోజు నుంచే గూగుల్ షాపింగ్ పోర్టల్ అందుబాటులోకి …
Read More »డిసెంబరు 31 తర్వాత క్రెడిట్/డెబిట్ కార్డులు బ్లాక్…ఎందుకో తెలుసా?
క్రెడిట్/డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోండి అంటూ మీ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా.. మీరు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా.. అయితే డిసెంబరు 31 తర్వాత మీ కార్డులేవీ పనిచేయవు. అవునా.. ఎందుకు? కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేగా మీ సందేహం. అయితే ఇది చదవండి. మోసాపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మ్యాగ్‌స్ట్రైప్ డెబిట్ …
Read More »హైదరాబాద్‌కు దక్కిన అరుదైన రికార్డ్ వెనుక కేసీఆర్ ఏం చేశారంటే…
రాష్ట్ర విభజన తర్వాత, సొంత పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆకర్షణీయ విధానాలతో అన్ని రంగాల బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణకు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల కార్యాలయాలకు హైదరాబాద్ నెలవైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తన సత్తాను చాటుతుంది. దీనికి సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఘనత ఉన్న సంగతి …
Read More »నా ఒక్క ఓటు వల్ల ఎన్నికలు ఆగిపోతాయా అనేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం
ఓటును ఎవ్వరూ తేలికగా తీసుకోకూడదు.. ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించిన ఓటు అనే మన హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి.నా ఒక్క ఓటు వల్ల ఏం అవుతుంది అని నిర్లక్ష్యం చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం వాటిల్లుతుంది. ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోయిన అరుదైన సంఘటనలు చరిత్రలో లేకపోలేదు. …
Read More »ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహం ఎక్కడంటే?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మరో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం రామమందిర నిర్మాణం చేయాలనే డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ధర్మసభ నిర్వహించగా….మరో వైపు అయోధ్యలో అతి ఎత్తైన రాముడి విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో యోగి బిజీగా ఉన్నారు. “స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్” పేరుతో రాముడి విగ్రహాం నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి శనివారం ఖరారు చేశారు. గుజరాత్ లో …
Read More »