మహారాష్ట్రలో ఓ దారుణం జరిగింది. బాలికపై ఓ ఎస్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల జూలై 13న బాలికను కారులో ఎక్కించుకుని నాగ్ పూర్ నగరం మొత్తం తిప్పి చూపించిన ఎస్సై అనంతరం ఆమెకు మద్యం తాగించి, హోటల్ రూంకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఇంటికి తిరిగెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక దాడికి పాల్పడిన …
Read More »ఆహార పదార్థాలపై జీఎస్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
దేశ వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆహార పదార్థాలపై కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, మరమరాలు, రవ్వ, మైదా పిండి, శనగ పిండి, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తుల్ని ప్యాక్ చేయకుండా లేదా లేబుల్ వేయకుండా విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ట్విటర్లో పేర్కొన్నారు.
Read More »ఎంపీగా పిటీ ఉష ప్రమాణం
ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ పీటీ ఉష ఈ రోజు బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. హిందీ భాషలో ఆమె ప్రమాణం చేయడం ఇక్కడ విశేషం. లెజండరీ అథ్లెట్ పీటీ ఉషతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ వీ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నేత వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
Read More »వామ్మో.. నుపుర్ శర్మను చంపేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చేశాడు!
మహమ్మద్ ప్రవక్తపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసిన బీజేపీ మాజీ మహిళా నేత నుపుర్ శర్మను చంపేందుకు ఓ వ్యక్తి ఏకంగా పాకిస్థాన్ వచ్చేశాడు. పాకిస్థాన్‌లోని మండీ బహుద్దీన్ పట్టణానికి చెందిన రిజ్వాన్ అష్రఫ్ అనే వ్యక్తి రాజస్థాన్ సరిహద్దు నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్‌ఎఫ్ సిబ్బందికి అతడు పట్టుబడంతో వారు విచారించారు. నిందితుడి వద్ద 11 అంగుళాల కత్తి ఉన్నట్లు గుర్తించారు. నుపుర్ శర్మను …
Read More »భారీ శాలరీతో కొత్త ఉద్యోగంలో చేరిన ఓ యువతికి భారీ షాక్
అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరానికి చెందిన లెక్సీ లార్సన్ గతంలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ఇటీవలే ఆమె టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన జాబ్‌లో చేరింది. తనకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో వివరిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన శాలరీ, ఇతర వివరాలు కూడా వెల్లడించింది. ఒకప్పుడు 70 వేల డాలర్లు సంపాదించే తనకు ప్రస్తుతం 90 వేల డాలర్లు వస్తోందని పేర్కొంది. ఈ వీడియో …
Read More »రాష్ట్రపతి పదవి విరమణ తర్వాత రామ్‌నాథ్ కోవింద్ కు ఏమి ఏమిస్తారో తెలుసా..?
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ నెల 24న ఆయనకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు హాజరుకానున్నారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్ ఖాళీ చేయాల్సి ఉన్నా రెండ్రోజుల ముందే ఆయన తన ఇంటి సామాను 12 జన్‌పథ్ బంగ్లాకు తరలించాలని …
Read More »దేశంలో 15,528 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. గత రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో 15,528 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 16, 113 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం దేశంలో మొత్తం 1,43,654 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు …
Read More »వీలుచైరులో వచ్చి మరి ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలయింది. సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగనున్నది.ఈ ఎన్నికల్లో భాగంగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీలుచైరులో వచ్చి మరి పార్లమెంట్ లో తన ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయన ఓటేశారు. వ్యక్తిగత …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 20,528 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,37,50,599కి చేరాయి. ఇందులో 4,30,81,441 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,709 మంది కరోనా మహమ్మారి భారీన పడి మృతిచెందారు. మరో 1,43,449 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 49 మంది కరోనాకు …
Read More »తెలంగాణ గురించి 8ఏండ్ల తర్వాత కండ్లు తెరిచిన మోదీ సర్కారు
తెలంగాణ రాష్ట్రమేర్పడిన దాదాపు 8ఏండ్ల తర్వాత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచింది. అందులో భాగంగా రేపటి జరగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన గిరిజన వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. రేపటి పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను కేంద్రంలోని మోదీ సర్కారు ప్రవేశపెట్టనుంది. అయితే తెలంగాణలో కేంద్ర గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర యూనివర్సిటీల సవరణ బిల్లు-2022ను తీసుకురానున్నట్లు …
Read More »