Home / NATIONAL (page 30)

NATIONAL

దేశంలో కొత్తగా 14,199 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,50,055 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,99,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 83 మంది చనిపోగా, మొత్తం 1,56,385 కరోనా మరణాలు సంభవించాయి.

Read More »

బీజేపీలోకి పీటీ ఉష

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న కేరళలో ప్రభావం చూపాలని బీజేపీ   ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఆకర్షించిన కాషాయ దళం ఇప్పుడు ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉషను తమ పార్టీలోకి చేర్చుకోనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా గళం విన్పించిన ఉష సహా పలువురు ప్రముఖులు త్వరలోనే బీజేపీలో చేరుతారని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read More »

మళ్లీ కరోనా గజగజ

హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే …

Read More »

దేశంలో ఇప్పటికి 85లక్షల మందికి కరోనా వ్యాక్సిన్

ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు 85 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వచ్చే సైడ్ ఎఫెక్టులు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఒక్కరు కూడా మరణించలేదన్న ఆయన.. దేశంలో కరోనా రికవరీ రేటు కూడా 97.29%గా ఉందని, ప్రపంచంలో అత్యంత తక్కువ కరోనా మరణాల రేటు కూడా దేశంలోనే నమోదైందన్నారు. గత 7రోజుల్లో 188 జిల్లాల్లో ఒక్క కరోనా …

Read More »

నా పార్టీలో చేరాలంటే రూ.25వేలు చెల్లించాలి-కమల్ హాసన్

విశ్వ విఖ్యాత సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ని ఎంపిక చేసే ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. పార్టీ లో చేరాల‌నుకునే స‌భ్యులు 25 వేల రూపాయ‌లు చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న సోమ‌వారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. మేలో జ‌ర‌గ‌నున్న ఎల‌క్ష‌న్స్ కోసం …

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

ప్రస్తుతం మన దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 9,121 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అంతేకాకుండా కరోనా బారీన పడి 81 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి కోలుకున్న 11,805 మంది నిన్న డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,09,25,710 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జి అయిన …

Read More »

కుప్పకూలిపోయిన గుజరాత్ సీఎం

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వడోదర ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా.. వేదికపై కుప్పకూలారు వెంటనే గమనించిన సిబ్బంది, బీజేపీకి చెందిన నేతలు ఆయన్ను పట్టుకున్నారు.. అనంతరం ప్రథమ చికిత్స అందించి, అహ్మదాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. గత కొన్ని రోజుల నుంచి విజయ్ రూపానీ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. కాగా ఈ నెల 21న పలు కార్పొరేషన్లకు, 28న మున్సిపాలిటీలు పంచాయతీలకు …

Read More »

ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శనివారం వరుసగా ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు 36 …

Read More »

రామ మందిర నిర్మాణానికి రూ 1500 కోట్లకు పైగా విరాళాలు

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఇప్పటివరకూ రూ 1500 కోట్లకు పైగా విరాళాలు వసూలయ్యాయి. మందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం ఈనెల 27తో ముగుస్తుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ప్రకటించింది. అయోధ్యలో అద్భుతంగా నిర్మించే రామాలయ నిర్మాణానికి దేశం యావత్తూ నిధులను అందిస్తోందని ట్రస్ట్‌ ట్రెజరర్‌ స్వామి గోవింద్‌ దేవ్‌ గిరి తెలిపారు. విరాళాల సేకరణ …

Read More »

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ టాప్

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకెళ్తోంది ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ రోజుల్లో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. దేశంలో ఇప్పటివరకు 60 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేశారు ఇండియాలో ఈ టీకాల పంపిణీకి 24 రోజుల సమయం పట్టింది. అమెరికాలో 26 రోజులు, యూకేలో 46 రోజుల సమయం పట్టింది. దేశంలో సోమవారం ఒక్కరోజే 2,23,298 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

Read More »