తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య తగ్గినట్లు ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్‌సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రీతిలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆయన తెలిపారు. 2014 నుంచి 2020 నాటికి సగానికి పైగా అన్నదాతల ఆత్మహత్యలు తగ్గినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో 2014లో 898 మంది రైతులు చనిపోగా, 2020లో 466 మంది రైతులు ఆత్మహత్య …
Read More »చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ
ప్రస్తుతం రెండేళ్ల తర్వాత తాజాగా చైనా కొవిడ్ విజృంభణతో అల్లాడిపోతోంది. ఈరోజు ఒక్కరోజే 13,146 కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులు ఇవి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వీటిలో 70% కేసులు షాంఘైలోనే నమోదయ్యాయి. వేలాది కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్లోనూ లార్డెన్ విధించారు. హైనన్ ప్రావిన్సులో సాన్యా నగరానికి వాహన …
Read More »దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,096 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా నుండి 1447 మంది కోలుకున్నారు. వైరస్లో 81 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గి 0.03 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,013 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త కరోనా వేరియంట్
ప్రపంచంలో తాజాగా ఎక్స్ఈ ఒమైక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది.ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి …
Read More »ఢిల్లీ సీఎం అరవింద్ ఇంటిపై దాడి-8మంది అరెస్ట్
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి,ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యొక్క అధికార నివాసంపై బీజేపీ నేతల దాడికేసులో ఢిల్లీ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిముందు నిన్న బుధవారం నిరసనకు దిగారు. కశ్మీర్ పండిట్లను కేజ్రీవాల్ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. …
Read More »దేశంలో కొత్తగా 1225 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,24,440కి చేరాయి. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు. మరో 14,307 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,21,129 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది మృతిచెందగా, 1594 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. కాగా, దేశవ్యాప్తంగా 184.06 కోట్ల టీకాలు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »పాన్-ఆధార్ లింక్ చేయలేదా? అయితే భారీగా ఫైన్!
మీకు పాన్ కార్డు ఉందా? ఉంటే దాన్ని ఆధార్‌తో లింక్ చేశారా? లేదా? చేయకపోతే మాత్రం ఏప్రిల్ 1 నుంచి మీరు ఫైన్ కట్టాల్సిందే. పాన్-ఆధార్ లింక్ చేసే గడువు మార్చి 31తో ముగిసిపోనుంది. ఈ గడువులోపు లింక్ చేసుకోకపోతే రూ.500 నుంచి రూ.1000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటన వెల్లడించింది. మార్చి 31 తర్వాత జూన్ …
Read More »పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం
పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై రేపు గురువారం రోజు జరగనున్న చర్చలో భాగంగా ఓటింగ్ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకుండా ఇమ్రాన్ ఖాన్ తన పార్టీకి చెందిన ఎంపీలకు విప్ జారీ చేశాడు. …
Read More »కేరళలో దారుణం -హిందువు కాదని…..?
కేరళలోని కూడల్ మాణిక్యం దేవాలయంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ దేవాలయంలో జరిగే జాతీయ నాట్య వేడుకల్లో నాట్యం చేసేందుకు ప్రముఖ భరతనాట్య కళాకారిణి మన్సీయకు అనుమతి నిరాకరించారు. తనకు ఎదురైన సంఘటనను.. అనుభవాన్ని సోషల్ మీడియాలోని ఫేస్ బుక్ వేదికగా మన్సీయ తెలుపుతూ తాను హిందువు కాదని..హిందూయేతరులను దేవాలయంలోకి అనుమతించబోమని వారు చెప్పినట్లు వివరించారు. తాను ముస్లీం కుటుంబంలో పుట్టానని..ప్రస్తుతం ఏ మతాన్ని నమ్మడం లేదని …
Read More »రాష్ట్రపతి గా వెంకయ్య నాయుడు.. నిజమేనా..?
భారత రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించినట్లు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విధితమే. సోషల్ మీడియాలో ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి వచ్చిన వార్తలపై ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మీడియా, సామాజిక మాధ్యమాలలో వస్తున్నవన్నీ వదంతులేనని ఉపరాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. అయితే మంగళవారం ఉదయం నుండి భారత రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పేరు ప్రతిపాదించారని ఎలక్ట్రానిక్ , సామాజిక మాధ్యమాల్లో …
Read More »