Home / NATIONAL (page 84)

NATIONAL

రేపు గోవాకు ప్రధాని నరేందర్ మోదీ

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రేపు గోవాకు వెళ్ల‌నున్నారు. గోవాలో జ‌రుగ‌నున్న గోవా లిబ‌రేష‌న్ డే ఉత్స‌వాలకు ఆయ‌న హాజ‌రుకానున్నారు. గోవాలోని డాక్ట‌ర్ శ్యామ ప్ర‌సాద్ ముఖ‌ర్జి స్టేడియంలో గోవా లిబ‌రేష‌న్ డే సంబ‌రాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా భార‌త భూభాగాలైన‌ గోవా, డామ‌న్ అండ్‌ డ‌య్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆప‌రేష‌న్ విజ‌య్‌లో పాల్గొన్న‌వారిని ప్ర‌ధాని మోదీ స‌త్క‌రించ‌నున్నారు. భార‌త‌దేశానికి 1947లో స్వాతంత్ర్యం వ‌చ్చినా గోవా, డామ‌న్ …

Read More »

ప్ర‌ధాని మోదీకి భూటాన్ అత్యున్న‌త పౌర పుర‌స్కారం

 ప్ర‌ధాని మోదీకి భూటాన్ అత్యున్న‌త పౌర పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. భూటాన్ జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా న‌డాగ్ పెల్ గి ఖొర్లో అవార్డును ప్ర‌క‌టించారు. భార‌త ప్ర‌ధాని మోదీకి త‌మ దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాన్ని ఇవ్వ‌డానికి సంతోషిస్తున్న‌ట్లు భూటాన్ ప్ర‌ధాని లోటే షేరింగ్ తెలిపారు. సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. భూటాన్ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం కూడా ఈ అవార్డు ప్ర‌క‌ట‌న‌పై ఫేస్‌బుక్‌లో ఓ ప్ర‌క‌ట‌న చేసింది. …

Read More »

న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో  బాంబు కలకలం

న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో  బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తికి రైలులో క్యాటరింగ్ సిబ్బంది తీరు నచ్చలేదు. ఆగ్రహానికి గురైన అతడు సోదరుడికి చెప్పడంతో.. ఆ వ్యక్తి రైలులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో రైలు మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఫోన్ కాల్పై విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.

Read More »

దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21గా ఉంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తగ్గించాలని, చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలో కేంద్రం …

Read More »

తమిళనాడుకు పాకిన ఒమిక్రాన్

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపించేలా కనిపిస్తోంది. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన 47 ఏళ్ల చెన్నై వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. మరోవైపు UKలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.ఇప్పటికే 10వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 20వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

Read More »

యూకేలో తీవ్రం రూపం దాల్చిన కరోనా మహమ్మారి

యూకేలో కరోనా మహమ్మారి తీవ్రం రూపం దాల్చింది. ఇవాళ ఒక్కరోజే ఆ దేశంలో ఏకంగా 78,610 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి దేశంలో ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే అత్యధికం. మరోవైపు కరోనా కారణంగా 165 మంది మరణించారు. ఇప్పటి వరకు యూకేలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,46,791కి చేరింది. ఇదిలా ఉండగా.. 10,017 ఓమిక్రాన్ వేరియంట్ కేసులతో దేశం …

Read More »

దేశంలో కొత్తగా 7,974 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 7,974 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 343 మంది వైరస్లో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,76,478కి చేరింది. మరోవైపు తాజాగా 7,948 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. ప్రస్తుతం దేశంలో 87,245 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

దేశంలో ఒమిక్రాన్ కలవరం

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 4 ఒమిక్రాన్ కేసులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కంటే 70% వేగంగా వ్యాప్తి చెందుతుందని హాంగ్కాంగ్ చేసిన ఓ అధ్యయనం తెలిపింది.

Read More »

దేశంలో ఒమిక్రాన్ కలవరం

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే 8 కేసులు వచ్చాయి. ఈ ఉదయం ఢిల్లీలో 4, రాజస్థాన్లో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే దేశంలో 16 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. ఇప్పటివరకు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

Read More »

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ వరాల జల్లు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ‘నేను నాయకుడిని కాదు. రాజకీయాలు ఎలా చేయాలో నాకు తెలీదు. పని ఎలా చేయాలో మాత్రమే తెలుసు. ఢిల్లీలో 10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం. ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం’ అని తెలిపారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat