రైతు ఆందోళనల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు తలదూర్చడాన్ని వ్యతిరేకిస్తూ సచిన్ చేసిన ట్వీట్కు ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కౌంటరిచ్చారు. రైతుల దీక్షలో కరెంట్, నీళ్లు, ఇంటర్నెట్ సేవలను కట్ చేసినప్పుడు, బీజేపీ మద్దతుదారులు రాళ్లు విసిరినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు? . రిహాన్నా, గ్రెటా ట్వీట్లు చేసేసరికి అందరూ నోళ్లు తెరుస్తున్నారు. వీళ్లంతా వెన్నెముక లేని మనసు లేని సర్కారు సెలబ్రిటీలు’ అని కౌంటర్ ఇచ్చారు
Read More »భారత్ లో 30కోట్ల మందికి కరోనా
మొత్తం 135కోట్ల జనాభా ఉన్న ఇండియాలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాపించి ఉండొచ్చని ICMR సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గిన విషయం కూడా తెలియకపోవచ్చని సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి చెప్పారు. తగినంత రోగనిరోధక శక్తి ఉండటం వల్లే లక్షణాలు బయటపడట్లేదన్నారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 30 వేల మందిపై సర్వే నిర్వహిస్తే.. 15 మందికి ఒకరిలో కోవిడ్ …
Read More »తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ బియ్యం సరఫరాలో అమలు చేస్తున్న ఓటీపీ విధానంతో ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు.. పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇక ఆధార్ కు ఫోన్ నంబర్, ఐరిస్ అనుసంధాన ప్రక్రియ రేషన్ షాపుల్లోనే చేయాలని నిర్ణయించింది. దీనిపై వినియోగదారులకు అవగాహన లేక హైరానా పడుతున్నారు. మీసేవా, బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ తరుణంలో వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న అధికారులు.. …
Read More »సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ సీఎం, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో అన్నదాతల రక్షణకు ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాకో PS ఏర్పాటు చేసి… వ్యవసాయ అంశాల్లో మోసాలు జరిగితే రైతుల అండగా నిలిచేలా చూడాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను, న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించడానికి ఈ పోలీసు స్టేషన్లు ఉపయోగపడాలన్నారు సీఎం జగన్. రైతుల కోసం స్పెషల్ డెస్క్ …
Read More »సరికొత్తగా వకీల్ సాబ్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ‘పింక్’ ఒర్జినల్ స్క్రిప్టులో చాలా మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కించారు. ఇక మూడేళ్ల తర్వాత పవన్ మళ్లీ తెరపై సందడి చేయనుండగా.. ఈ సినిమాలో పవన్ కోసం ఓ స్పెషల్ సీన్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ సీన్ కు థియేటర్లలో …
Read More »టీమిండియా పేసర్ అశోక్ దిండా క్రికెట్ కు రిటైర్మెంట్
టీమిండియా పేసర్ అశోక్ దిండా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 36 ఏళ్ల దిండా భారత్ తరపున 13 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా అవకాశాలు రానప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రికార్డుల మోత మోగించాడు. 2005 నుంచి 2019 వరకు 420 వికెట్లు తీసి సత్తా చాటాడు. IPLలో KKR, పుణె, ఢిల్లీ, RCB …
Read More »బాలయ్యతో గోపీచంద్ మలినేని మూవీ
ఇటీవల కరోనా కాలంలో విడుదలై మాస్ మహారాజ్ రవితేజ,అందాల రాక్షసి శృతి హాసన్ నటించిన క్రాక్ తో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నాడని టాక్. గోపీ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది నుంచే సెట్స్ పైకి వెళ్తుందట. దీనిపై త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ …
Read More »ప్రేమ పేరుతో నరకం
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికను బలి తీసుకున్నాడు. బండి రాజు అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఓ బాలికను వేధించేవాడు. ఆమెపై అత్యాచారం చేసి.. పురుగుల మందు తాగించాడు. అనంతరం తానూ తాగాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. ప్రేమ పేరుతో నరకం చూపించాడు’ అంటూ ఆ బాలిక చివరిమాట చెప్పి ఊపిరి వదిలింది.
Read More »రైతు ఉద్యమానికి పాప్ సింగర్ రిహాన్నా మద్దతు
ఇంటర్నేషనల్ పాప్ సింగర్ రిహాన్నా రైతు ఆందోళనలకు మద్దతిచ్చింది. ‘ఈ అంశంపై మనం ఎందుకు మాట్లడటం లేదు’ అని ట్విట్టర్ లో ప్రశ్నించింది. ఆమె అడిగిన తీరుకు సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మనదేశ సెలబ్రిటీలు ఎక్కడా అంటూ నెటిజన్లు #UselessIndian celebrities అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఆమెకు కౌంటర్గా కంగనా ‘వారు రైతులు కాదు. అందుకే వారి గురించి ఎవరూ మాట్లాడరని’ ఘాటుగా సమాధానమిచ్చింది.
Read More »బాత్రూంలోకి మొబైల్స్ తీసుకెళ్తున్నారా ?
ప్రస్తుతం చాలా మంది బాత్రూంలోకి మొబైల్స్ తీసుకెళ్తున్నారా ? ఈ మధ్య చాలామందికి బాత్ రూంలోకి మొబైల్స్ తీసుకెళ్లడం వ్యసనంగా మారిపోయింది. అయితే మొబైల్ ఫోన్ బాత్రూంలోకి తీసుకెళ్లే అలవాటు అనారోగ్యాన్ని మోసుకొస్తుంది. మొబైల్ తో బాత్రూమ్లో కూర్చున్నప్పుడు, ఫోన్ పైన పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఈ కారణంగా సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్ లోనే కూర్చుంటారు. దీి వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి …
Read More »