ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న బ్రిటన్, ఇటలీ దేశాల్లోని చిన్నారుల్లో అంతుచిక్కని వ్యాధి ప్రబలడం ఆందోళన కలిగిస్తున్నది. అధిక జ్వరం, రక్తనాళాల్లో వాపు వంటి లక్షణాలతో పెద్ద సంఖ్యలో పిల్లలు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ వ్యాధికి, కరోనా మహమ్మారికి ఏమైనా సంబంధం ఉన్నదా అన్నదానిపై ఇరుదేశాల వైద్య నిపుణులు పరిశీలన జరుపుతున్నారు. కావసాకీ వ్యాధి తరహా లక్షణాలతో ఉత్తర ఇటలీలో తొమ్మిదేండ్లలోపు చిన్నారులు దవాఖానల్లో చేరుతున్నారు. అలాగే బ్రిటన్‌లోని చిన్నారుల్లోనూ …
Read More »ఏపీలో కరోనా రోజుకో రికార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దూకుడుకు అడ్డుకట్ట పడటం లేదు. గత మూడురోజుల నుంచి 80కి తక్కువ కాకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 82 కేసులు వెలుగు చూశాయి. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 1,259కి చేరింది. రాష్ట్రంలో మొదటి 603 కేసులు నమోదు కావడానికి 38రోజులు పట్టగా ఆ తర్వాత 656 కేసులు కేవలం 10రోజుల్లోనే వెలుగు చూశాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరో 17మంది …
Read More »అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం
ఏపీలో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. కళ్యాణదుర్గం – రాయదుర్గం ప్రధాన హైవే రోడ్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు
Read More »కర్నూల్ నుండి పాలమూరుకి కరోనా ముప్పు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి తెలంగాణకు కరోనా వ్యాప్తి చెందుతున్నది. తెలంగాణ సరిహద్దులోని ఈ ఒక్క జిల్లాలోనే 234 పాజిటివ్ కేసులు నమోదవడం కలవరానికి గురిచేస్తున్నది. కర్నూలులో ఇటీవల కరోనాతో మృతి చెందిన డాక్టర్ వద్దకు వెళ్లివచ్చిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఆర్‌ఎంపీతో కాంటాక్ట్ అయిన దాదాపు 45 మందిని క్వారంటైన్ …
Read More »తొలి కరోనా ఫ్రీ రాష్ట్రం ఇదే
కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న భారతదేశంలో ఒక్కో రాష్ట్రం కరోనాను తరిమికొట్టడంలో విజయవంతంమవుతున్నాయి. త్రిపుర కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెండో పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి కోలుకున్న తర్వాత కరోనా కేసులు లేని రాష్ట్రంగా మారిందన్నారు. త్రిపురలో తొలుత రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి వ్యక్తికి ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి …
Read More »తెలంగాణ పల్లెపల్లెనా ధాన్యరాశులు
తెలంగాణలో పల్లెపల్లెనా ధాన్యరాశులు కనిపిస్తున్నాయనీ, పక్కా ప్రణాళికతో ప్రభుత్వం కొనుగోళ్లను చేపడుతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ విధానంపై ఇతర రాష్ర్టాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పారు. గురువారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం, అప్పాజీపల్లి, చిన్నఘణపూర్, మెదక్ మండలంలోని మంబోజిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కోసం …
Read More »రంగనాయక్ సాగర్ కు నేడు కాళేశ్వర నీళ్లు
కాళేశ్వర ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కారమవుతున్నది. నాలుగేండ్ల క్రితం మేడిగడ్డ వద్ద వెనుకకు అడుగులు వేయడం మొదలుపెట్టిన గోదావరి.. రంగనాయకసాగర్‌లో కాలుమోపడంతో సప్తపదులు పూర్తిచేసుకోనున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగనాయకసాగర్‌లోకి వస్తున్నాయి. పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణం కాబోతున్నది. శుక్రవారం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ పంప్‌హౌజ్‌లోని నాలుగుమోటర్లలో ఒక మోటర్ వెట్ రన్ …
Read More »6 నెలల చిన్నారికి కరోనా
మేడ్చల్ జిల్లాలో ఆరునెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ పేజ్-3లో ఓ క్యాబ్ డ్రైవర్ కుటుంబం నివాసముంటున్నది. ఆరునెలల తన కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సదరు క్యాబ్ డ్రైవర్ ఈ నెల 8న హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. వెంటనే పాపను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read More »కొత్త దరఖాస్తుదారులకూ రేషన్
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఎవరైతే ఇప్పటివరకు రైస్‌కార్డు లేకుండా కొత్తగా కార్డుకోసం దరఖాస్తు చేసుకొన్నారో వారిలో అర్హులకు సరుకులు పంపిణీ చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆ దరఖాస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఆరు అంచెల మూల్యాంకనం చేయాలన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాల్సిందిగా తెనాలి సబ్ కలెక్టర్, నాలుగు డివిజన్ల ఆర్డీవోలు, తమసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్‌లు, సీఎస్‌డీటీలను జేసీ ఆదేశించారు.
Read More »టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా జరుపుకుందాం..ఎంపీ సంతోష్
ఈనెల (ఏప్రిల్) 27 తో తెలంగాణ రాష్ట్ర సమితికి 20 సంవత్సరాలు నిండుతున్నాయి. మామూలుగా అయితే ఈ పండుగను ఉత్సవ వాతావరణంలో జరుపుకోవాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో, చాలా సాదాసీదాగా ఈ 20 ఏళ్ల ఆవిర్భావ పండుగను జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వినూత్న పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రభావం …
Read More »