దేశంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో గత రెండు వారాలుగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి. మరోవైపు దేశంలో పాజిటివ్ …
Read More »దిశ తప్పిన దిశా పటాని అందాలు
అంబేద్కర్ రాజ్యాంగం వల్ల తెలంగాణ సిద్ధించింది.
భారత రాజ్యాంగ నిర్మాత.. భారత రత్న బీఆర్ అంబేద్కర్ , మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ నెల 5న జగ్జీవన్ రామ్, 14న అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, వివిధ సంఘాల నాయకులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం …
Read More »ఏపీలో బీజేపీ జాతీయ కార్యదర్శి వాహనంపై దాడి
ఏపీ అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. తాళ్లాయపాలెంలో నిందితుడు దున్న నితిన్ ను అరెస్టు చేశారు. అతనే వాహనంపై రాయి విసిరినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాజధాని రైతులకు మద్దతు ప్రకటించేందుకు అమరావతి వెళ్తుండగా మూడు రాజధానుల మద్దతుదారులు సత్య కుమార్ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More »పాలకూర తినడం మంచిదా..? కాదా..?
మనకు పాలకూర మనకు కొత్తేం కాదు. పప్పులో వేసుకుంటాం. తాలింపు చేసుకుంటాం. తరచూ పాలకూర తింటే చర్మం అందంగా తయారవుతుంది. చర్మ కణాలు మృదుత్వాన్ని పొందుతాయి. చర్మం పొడిబారడాన్ని, ముడతలు పడటాన్ని తగ్గిస్తుంది. పాలకూరలోని మెగ్నీషియం, ఐరన్ జుట్టు రాలిపోకుండా చేస్తాయి. వెంట్రుకలు చిట్లడమూ తగ్గుతుంది. జీర్ణవ్యవస్థకు సహకరించే మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉదయం పూట గ్రీన్ జ్యూస్‌గా తీసుకుంటే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాలకూర వల్ల …
Read More »దేశానికే ఆదర్శంగా స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య
తెలంగాణ లో స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య అద్భుతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య పదవ సర్వసభ్య సమావేశం హైదరాబాదులోని శిల్పారామం లో జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1. 59 లక్షల సంఘాలలోని 5.30 లక్షల సంఘ సభ్యులు …
Read More »వీరసింహారెడ్డి,వాల్తేరు వీరయ్ లను దాటిన దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా అరుదైన రికార్డు సాధించింది. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కినెట్టి కలెక్షన్లు రాబడుతోంది. 2023లో నైజాంలో తొలిరోజు ఎక్కువ కలెక్షన్లు ఈ సినిమాకే వచ్చాయి. దసరా మూవీకి రూ.6.78 కోట్లు రాగా రెండో స్థానంలో బాలయ్య వీరసింహారెడ్డి- రూ.6.21 కోట్లు, ఆ తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య- రూ.6.10 కోట్లు, వారసుడు (తెలుగు)- రూ.1.40 కోట్లు ఉన్నాయి.
Read More »ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు-8మంది అరెస్ట్
గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మోదీ హటావో, దేష్ బచావో’ పేరుతో నిందితులు ఈ పోస్టర్లు ముద్రించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఇటీవల ఢిల్లీలోనూ ఈ తరహా పోస్టర్స్ గుర్తించిన అధికారులు.. 185 కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Read More »డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. 2006లో డేనియల్స్ తో ఎఫైర్ నడిపినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటపెట్టకుండా ఆమెకు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదే ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకుంది. అరెస్టు దాకా తీసుకొచ్చింది. ఈ ఆరోపణలు నిజమని న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ తేల్చింది. తాజా పరిణామాలను ట్రంప్ ఖండించారు. తనను కావాలనే వెంటాడుతున్నారని ఆరోపించారు. మరోవైపు ట్రంప్ …
Read More »