తెలంగాణ సంప్రదాయ ఆచార సంస్కృతిలకు ప్రతిరూపమైన పూలసంబురం బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు. అలసిన అమ్మవారికి ఘనమైన పాకాలు నివేదన చేస్తారు భక్తులు. ‘పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా’ అంటూ అమ్మకు రకరకాలైన …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పకన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆటపాటలతో, పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగతిస్తూ ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం కేసీఆర్ …
Read More »తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
బతుకమ్మలో తెలంగాణ సంస్కృతి, ఆధునికత అద్భుతంగా మిళితమై ఉన్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న ఎలక్ట్రిక్ ఫార్ములా వన్ కారు, బతుకమ్మతో ఉన్న ఫొటోను మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, దానిని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. Telangana is where Culture and Modernity blend beautifully ? https://t.co/fbGJmY5TSe — KTR (@KTRTRS) October 2, …
Read More »23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
వాట్సాప్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముందస్తుగా 10 లక్షలకుపైగా అకౌంట్లను బ్యాన్ చేశామని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉద్దేశించిన తమ ఫిర్యాదుల పరిష్కార చానెల్‌లో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ సంస్థ యూజర్ల ఖాతాలపై చర్యలు తీసుకొన్నది. జూలైలో 23.87 లక్షల ఖాతాలను …
Read More »నవరాత్రుల్లో ఎనిమిదో రోజు ఎందుకంత ప్రత్యేకత..?
నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మవారిని గౌరీదేవిగా ఆరాధిస్తారు. గౌరీదేవి తెలుపు, పసుపు, ఎరుపు మిళితమైన గౌర వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మల్లెపూవులా, శంఖంలా, చంద్రునిలా కనిపించి మనసుకు హాయిని కలిగిస్తుంది. గౌరి అష్టవర్ష ప్రాయంతో శోభిస్తుంది. అంటే, ఎనిమిదేండ్ల బాలికలా వెలిగిపోతుంటుంది. వృషభ వాహనాన్ని అధిరోహించి చతుర్భుజాలతో కనిపిస్తుంది. కుడిచేతులలో అభయముద్ర, త్రిశూలం ఉంటాయి. ఎడమ చేతులలో డమరుకం, వరద ముద్ర ఉంటాయి. గౌరీశక్తి అమోఘం. ఆ తల్లిని ఆరాధించిన …
Read More »టార్గెట్ బీజేపీ.. ఆరోజే నేషనల్ పార్టీ ప్రకటన: కేసీఆర్
బీజేపీని గద్దె దించడమే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దసరా పండుగ రోజేనే జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. జాతీయ పార్టీకి బీఆర్‌ఎస్‌తో పాటు పలు పేర్లను పరిశీలిస్తున్నామని, విజయదశమి రోజున మధ్యాహ్నం 1.19కి …
Read More »అదే హైబ్రిడ్‌పిల్లకు తృప్తి ఇస్తుందట!
తన నటన, క్యారెక్టర్‌తో లేడీ పవర్‌స్టార్ అనిపించుకుంటున్న సాయి పల్లవి తాను ఎంపిక చేసుకునే పాత్రల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ హైబ్రిడ్‌పిల్ల నటించాల్సిన సినిమాలో పాత్ర నచ్చితే చాలు ఇట్టే ఓకే చేసేస్తుందే తప్ప హిట్టు, ఫ్లాపుల గురించి ఆలోచించనని చెప్తోంది. మనసుకు నచ్చిన క్యారెక్టర్స్ చేస్తున్నానా లేదా అనేది మాత్రమే తనకు సంతృప్తి ఇస్తుందంటోది సాయిపల్లవి. ఓ క్యారెక్టర్ ఎలా చేయాలి అనే విషయంలో ఎలాంటి …
Read More »రాముడి పాత్రకు ప్రభాస్ నో చెప్పాడట.. కానీ!
ఆదిపురుష్ టీజర్ ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది. ఇందులో రాముడి గెటప్‌లో ప్రభాస్‌ను చూస్తే సాక్ష్యాత్తు శ్రీరాముడినే చూసినట్లు ఉంది. అయితే ఇంతలా మెప్పించిన ఈ పాత్ర చేయడానికి ప్రభాస్ ముందుగా ఒప్పుకోలేదట. దాదాపు 3 నెలలు కంటిన్యూగా నో చెప్తూనే ఉన్నాడట. ఆదివారం అయోధ్యలో జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఈ మూవీకి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రతి మనిషిలోనూ శ్రీరాముడు ఉంటాడని, రాముడిపై ఉన్న …
Read More »అదరగొట్టిన ‘ఆదిపురుష్’ టీజర్.. నీళ్లలో ప్రభాస్ తపస్సు!
ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. దీంతో మూవీపై భారీ అంచనాలు పెంచుకున్న సినీప్రియులు, అభిమానులు టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం అయోధ్యలో టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్ ప్రారంభంలో ప్రభాస్ నీళ్లలో తపస్సు చేస్తూ కనిపిస్తారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ను చూస్తే అచ్చు …
Read More »