నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మవారిని గౌరీదేవిగా ఆరాధిస్తారు. గౌరీదేవి తెలుపు, పసుపు, ఎరుపు మిళితమైన గౌర వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మల్లెపూవులా, శంఖంలా, చంద్రునిలా కనిపించి మనసుకు హాయిని కలిగిస్తుంది. గౌరి అష్టవర్ష ప్రాయంతో శోభిస్తుంది.
అంటే, ఎనిమిదేండ్ల బాలికలా వెలిగిపోతుంటుంది. వృషభ వాహనాన్ని అధిరోహించి చతుర్భుజాలతో కనిపిస్తుంది. కుడిచేతులలో అభయముద్ర, త్రిశూలం ఉంటాయి. ఎడమ చేతులలో డమరుకం, వరద ముద్ర ఉంటాయి. గౌరీశక్తి అమోఘం. ఆ తల్లిని ఆరాధించిన వారికి సమస్త పాపాలూ తొలగిపోతాయి. ఎన్నో అలౌకిక సిద్ధులు కలుగుతాయి.ఇహపర సుఖాలు సంప్రాప్తిస్తాయి.
నైవేద్యం: చక్కెర పొంగలి,
బెల్లం పాయసం