ఆ వ్యక్తికి సుమారు 35 ఏళ్లు ఉంటాయి. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఎదురుగా వస్తున్న రైలుకు దండం పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య విగతజీవిగా మారాడు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి పట్టాలపైకి రావడాన్ని గుర్తించిన రైలు ఇంజిన్ లోకో పైలట్ …
Read More »కలెక్టర్‌తో కోతులు ఆటలు.. నవ్వులే నవ్వులు!
కోతులు చేసే అల్లరి ఇంతాఅంతా కాదు. ఆడుకునే వస్తువుల నుంచి చేతిలోని సంచుల వరకు వేటినీ వదల కుండా ఎత్తుకెళ్తుంటాయి. వాటి చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ కోతి ఏకంగా కలెక్టర్‌నే ఆటపట్టించింది. అంతేకాకుండా అక్కడున్న అధికారులతో బతిమాలించుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా కలెక్టర్ నవ్‌నీత్ చాహల్ ఉన్నాతాధికారులతో …
Read More »నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏయే రూట్లలో అంటే..
రాష్ర్టంలో నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాలు ఈ రోజుతో పూర్తికానున్నాయి. ఇందుకు సంబంధించిన ముగింపు సభను సిటీలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఆ రూట్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఇందుకు వాహనదారులు ఆల్టర్‌నేట్ రూట్స్‌లో వెళ్లాలని పోలీసులు తెలిపారు. ఏ ఏరియాల్లో అంటే.. – బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం నుంచి రైట్‌సైడ్ …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధం గురించి ఎమ్మెల్సీ కవిత క్లారిటీ.?
దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శంచారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారన్నారు. బట్టకాల్చిమీద వేయడం బీజేపీ పని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యక పరిణామం కాదన్నారు. బిల్కిస్ …
Read More »టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కడవెండిలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అధ్వర్యంలో హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సోమవారం ఆ పార్టీ కి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి, వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా …
Read More »ఢిల్లీ చెప్పులు మోసే వారిని రాష్ట్రం గమనిస్తుంది: కేటీఆర్
మునుగోడులో జరిగిన బీజేపీ సమరభేరి సభకు హాజరైన అమిత్ షా పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గుడి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకునేందుకు వెళ్తుండగా వారి వెంటే ఉన్న బండి సంజయ్ ఉరికి ఉరికి వెళ్లి అమిత్ షాకు చెప్పులు అందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కేటీఆర్ దాన్ని ట్విట్టర్‌లో …
Read More »సుభాష్ నగర్ డివిజన్ లో ‘రక్తదాన శిబిరాన్ని‘ ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ కాపు సంఘం కమిటీ హాల్ లో రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 6వ సారి ఏర్పాటు చేసిన ‘రక్తదాన శిబిరాన్ని‘ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే గారు పండ్లు, జ్యూస్ అందజేశారు. …
Read More »దేశంలోని విపక్షాలన్నీ ఒప్పుకుంటే ఆయనే బలమైన ప్రధాని అభ్యర్థి..?.. ఎవరతను..?
దేశంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్..బీజేపీ దేశాన్ని ఆగం పట్టిస్తున్నాయి. గతంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పాలనతో ఆగమైన దేశాన్ని తాజాగా గత ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు డెబ్బై ఐదేండ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని ఇటు పొలిటికల్ క్రిటిక్స్.. అటు విపక్ష పార్టీలైన ఆర్జేడీ,జేడీయూ,సీపీఐ,సీపీఎం,టీఎంసీ,టీఆర్ఎస్ ,ఎస్పీ,బీఎస్పీ,డీఎంకే లాంటి పార్టీలన్ని విమర్శిస్తున్నాయి. దేశంలో మూడో ప్రత్యామ్నాయం రావాలని.. అందుకు దేశంలోని పార్టీలన్నీ కల్సి రావాలని …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన శంకర్ మహాదేవన్
మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే ఆక్సీజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజసిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయన్నారు శంకర్ మహాదేవన్. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహాదేవన్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మాజీ సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ, మరో స్నేహితుడు రాజు తో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. అనంతరం శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. …
Read More »కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
దాదాపు నూట ముప్పై ఏడేండ్లు ఉన్న పార్టీ… స్వతంత్ర భారతాన్ని అతి ఎక్కువ కాలం పాలించిన ఏకైక పార్టీ … ఈ దేశానికి ఎంతో మంది ప్రధానులను.. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను అందించిన పార్టీ.. అదే కాంగ్రెస్ పార్టీ.. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు మరీ దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ స్టీరింగ్ …
Read More »