దేశంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్..బీజేపీ దేశాన్ని ఆగం పట్టిస్తున్నాయి. గతంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పాలనతో ఆగమైన దేశాన్ని తాజాగా గత ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు డెబ్బై ఐదేండ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని ఇటు పొలిటికల్ క్రిటిక్స్.. అటు విపక్ష పార్టీలైన ఆర్జేడీ,జేడీయూ,సీపీఐ,సీపీఎం,టీఎంసీ,టీఆర్ఎస్ ,ఎస్పీ,బీఎస్పీ,డీఎంకే లాంటి పార్టీలన్ని విమర్శిస్తున్నాయి.
దేశంలో మూడో ప్రత్యామ్నాయం రావాలని.. అందుకు దేశంలోని పార్టీలన్నీ కల్సి రావాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నిన్న ఆదివారం మీడియాకు తెలిపారు. విపక్ష పార్టీలన్నీ అంగీకరిస్తే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి అవుతాడని ఈ సందర్భంగా తెలిపారు. బీహార్ లో ఆయనకు క్షేత్రస్థాయిలో మంచి పేరు ఉంది.