Home / SLIDER / టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

జ‌న‌గామ‌ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం దేవ‌రుప్పుల‌, క‌డ‌వెండిల‌కు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అధ్వర్యంలో హైద‌రాబాద్ లోని మినిస్ట‌ర్స్‌ క్వార్ట‌ర్స్‌లో సోమ‌వారం ఆ పార్టీ కి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

టిఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి, వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, దేశంలోనే టిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రజాదరణ, పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ అన్నారు. ఈ పార్టీలో చేరడం పట్ల మనమంతా గర్వ పడాలని చెప్పారు. కెసిఆర్ అనుభవంతో కూడిన దిశా నిర్దేశం, యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ లీడర్షిప్ ఉన్న పార్టీ అని చెప్పారు. భవిష్యత్తు లేని, ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో అయ్యేది ఏమి లేదన్నారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.

టిఆర్ఎస్ లో చేరిన వారిలో దేవ‌రుప్పుల‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప్పుల సోమ‌య్య‌, ఉప్పుల మ‌ల్ల‌య్య‌, ఉప్పుల హ‌రిచంద్రు, బాషిపాక ప‌ర‌శురాములు, ఉప్పుల అంజ‌య్య‌, ఉప్పుల మ‌ధు, చీటూరు యాద‌గిరి, చీటూరు రాజ్ కుమార్‌, బండిపెల్లి న‌వీన్‌, బండిపెల్లి ప్ర‌దీప్‌, బాషిపాక శోభ‌న్ బాబు, జోగు ప్ర‌వీణ్‌, ఉప్పుల ఎల్ల‌య్య‌లు ఉన్నారు. అలాగే క‌డ‌వెండి గ్రామ పార్టీ కార్య‌ద‌ర్శి బాషిపాక కుమార్‌, సాంస్కృతిక కార్య‌ద‌ర్శి జీడి న‌ర్సింహ‌, సిపిఐకి చెందిన‌సులుగురి సురేశ్‌, కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ బాషిపాక కృష్ణ‌, బాషిపాక యాద‌య్య‌, బెజ‌గం సురేశ్‌, బాషిపాక వంశీ, దండెంప‌ల్లి అయిల‌య్య‌, తాళ్ళ‌పెల్లి మ‌దార్‌, దండెంప‌ల్లి మ‌హేశ్ త‌దిత‌రులు ఉన్నారు.

కాగా, వీరంతా టిఆర్ ఎస్ మండ‌ల శాఖ అధ్యక్షుడు తీగ‌ల ద‌యాక‌ర్‌, మాజీ మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు బ‌స్వ మ‌ల్లేశ్‌, మండ‌ల సీనియ‌ర్ నాయ‌కులు ప‌ల్లా సుంద‌ర్ రామిరెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లూరు సోమ‌న్న‌, సుద‌ర్శ‌న్ రెడ్డి, మండ‌ల కోప్ష‌న్ మెంబ‌ర్ మ‌దార్, ఎఎంసి డైరెక్ట‌ర్ బాషిపాక భిక్ష‌ప‌తి, ఎఎంసి మాజీ డైరెక్ట‌ర్ జోగు సోమ‌న‌ర్స‌య్య‌, దేవ‌రుప్పుల, క‌డ‌వెండి గ్రామాల‌ సీనియ‌ర్ నాయ‌కులు కిష్ట‌య్య‌, పెద్ది ర‌వింద‌ర్‌, ప‌డ‌మ‌టింటి కొముర‌య్య‌, క‌త్తుల సుధాక‌ర్‌, బాషిపాక అంజ‌య్య‌, చింత యాద‌గిరి, బాషిపాక అబ్బ‌య్య‌, త‌దిత‌రులు ఆధ్వ‌ర్యం వ‌హించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat