వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం రికార్డులు తిరగరాస్తోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలకుతోడు సాగునీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. గతేడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. ఈ సీజన్‌లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగటంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 36.01 శాతం పెరుగుదలతో రెండోస్థానంలో జార్ఖండ్ ఉండగా, 35.14 శాతం పెరుగుదలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా పంటల సాగును గతేడాదితో పోలుస్తూ …
Read More »పోలీసులకు కరోనాలో హైదరాబాద్,వరంగల్ టాప్
తెలంగాణలో పోలీసులకు కరోనా కేసుల్లో హైదరాబాద్ కమిషనరేట్ టాప్‌గా నిలిచింది. 1,967 మంది వైరస్ బారిన పడగా.. 891 మంది చికిత్స పొందుతున్నారు. 1,053 మంది డిశ్చార్జి కాగా 23 మంది మరణించారు. అదే సమయంలో హైదరాబాద్ తరువాత వరంగల్‌లో అత్యధికంగా 526 కేసుల్లో.. 361 మంది చికిత్స పొందుతున్నారు. 163 మంది డిశ్చార్జి కాగా, ఇద్దరు మరణించారు. 5,684 మందిలో 1,593 మంది డ్యూటీకి రిపోర్టు చేశారు. కాగా, …
Read More »హైదరాబాద్ లో సిటీ బస్సులు తిరుగుతాయా….?
హైదరాబాద్ లో ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా తిరిగి పట్టాలెక్కనుందా? నిలిచిపోయిన సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్రం సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న దృష్ట్యా గ్రేటర్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీబస్సుల రాకపోకలపై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా వీటికి అనుమతి లభించవచ్చనే అంచనాలతో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. లాంగ్ రూట్లకే పరిమితం.. ప్రభుత్వం అనుమతిస్తే ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు …
Read More »తెలంగాణలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటింది. అలాగే రోజురోజుకూ ఈ టెస్టులు భారీగా పెరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్ మేరకు.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా టెస్టులు 10,21,054 జరిగాయి. అందులో సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో అత్యధికంగా 52,933 పరీక్షలు నిర్వహించారు. దీంతో ప్రతీ 10 లక్షల జనాభాకు చేసిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 27,502కు చేరింది. ఇక రాష్ట్రంలో …
Read More »కాలుష్య రహితంగా ఫార్మాసిటీ
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ‘టీ ఫైబర్’కార్యాలయంలో హైదరాబాద్ ఫార్మాసిటీపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు, ఆర్థిక, పురపాలక, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఫార్మాసిటీలో తమ యూ నిట్ల ఏర్పాటుకు వందలాది ఫ్యాక్టరీలు ఎదు రు …
Read More »కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే షాకిచ్చిన హ్యాకర్లు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్ చేశారు. కేంద్ర మంత్రి కాకముందు ఈ వెబ్‌సైట్‌ను తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ వెబ్‌సైట్‌ను అంతగా వినియోగించడం లేదు. ఆగస్టు 15న ఈ వెబ్‌సైట్ హ్యాక్ అవగా.. ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వెబ్‌సైట్ హ్యాక్ అయినట్టుగా కిషన్‌రెడ్డి కార్యాలయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు …
Read More »మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు కరోనా
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కలెక్టర్‌కు మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయనతో పాటు పలువురు మంత్రులు సైతం పాల్గొడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమావేశంలో కలెక్టర గౌతమ్‌తో సహా.. మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, …
Read More »కాళేశ్వరంతో మారిన రాష్ట్ర ముఖచిత్రం
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ముఖచిత్రం మారింది. బోరు ఎండేది లేదు.. బాయి దంగేది లేదు.. మోటరు వైండింగ్, జ నరేటర్, ఇన్వర్టర్ దుకాణాలు బంద్ అయ్యాయి. సాగునీటి గోస తీరడంతో వలసలు వెళ్లినోళ్లు సైతం తిరిగొస్తున్నా రు’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మం డల కేంద్రంతోపాటు జక్కాపూర్, గు ర్రాలగొంది, మల్యాల, గోపులాపూర్, మాటిండ్ల, బంజేరుపల్లి, లక్ష్మిదేవిపల్లిలో పలు …
Read More »కొదండరాం సంచలన నిర్ణయం
పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) నిర్ణయించింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి కచ్చితంగా కోదండరాం బరిలో నిలుస్తారని, ఈ మేరకు తదుపరి సమావేశంలో నిర్ణయం జరగడం సూత్రప్రాయమే అని పలువురు టీజేఎస్ నేతలు తెలిపారు. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్-ఖమ్మం- …
Read More »తెలంగాణలో కొత్తగా 2,579 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈరోజు కొత్తగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670కు చేరింది. తెలంగాణలో గత 24గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 770 మంది మృత్యువాతపడ్డారు. ఇవాళ 1,752మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 84,163 మంది …
Read More »