విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన పలువురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవుతున్నది. ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వారిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. లండన్ నుంచి వచ్చిన ఏపీలోని గుంటూరుకు చెందిన యువకుడు (24), హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన యువకుడు (23), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు (23), స్వీడన్ నుంచి వచ్చిన ఏపీలోని రాజోలుకు చెందిన యువకుడు (26), …
Read More »సీఎం కేసీఆర్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందనలు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను అత్యుద్భుతంగా విజయవంతం చేసినందుకుగాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌తో అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను కొనియాడారు. జనతా కర్ఫ్యూ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలిచిందని అమిత్‌షా ప్రశంసించారు.
Read More »లాక్‌డౌన్ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. లాక్‌డౌన్ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ పిలుపునిచ్చారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటోలను, క్యాబ్‌లను, ప్రయివేటు వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల కరోనాను నియంత్రించొచ్చు అని …
Read More »తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి
తెలంగాణలో ఆహార ధాన్యాలకు కొరత లేదు . బియ్యం , పప్పులు ఏ జిల్లాలో ఏ వ్యాపారి దగ్గర ఎంత స్టాక్ ఉందో ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది . ఒక్కోసారి ఒక పూట కూరగాయలు అందుబాటులో లేకపోయినా ఇంట్లో ఉన్న పప్పు దినుసులతో సరిపెట్టుకోవాలి . యాసంగిలోనే 38 లక్షల ఎకరాల్లో పంట రాబోతున్నది . మూడు నాలుగు రోజులు ఓపిక పడితే ప్రభుత్వం సుమారు 87 లక్షల …
Read More »లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో ఉండే సేవలు ఇవే..!
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల నియంత్రణ చట్టం-1897ను రాష్ట్రంలో ప్రయోగించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్లు దాటి బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ నిబంధనను కచ్చితంగా …
Read More »72 ఏళ్ల తర్వాత..మళ్లీ హైదరాబాద్ లో అదే సీన్
గ్రేటర్ హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ అయింది. జనమంతా కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఇళ్ల ముందరకు వచ్చిచప్పట్లతో వైద్యులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రభుత్వ పిలుపుతో మహానగరం పూర్తిగా స్పందించింది. ఎవరికి వారు స్వీయ నిర్బంధాన్ని అమలు చేయటంతో నగరమంతా బోసిపోయింది. గతమెన్నడూ లేని రీతిలో పూర్తి నిర్మానుష్యమైంది. …
Read More »ఉగాది ,శ్రీరామనవమి వేడుకలు వాయిదా
ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తుందని, అయితే ప్రాణాంతక కరోన వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలతో పాటు సామూహిక శ్రీరామనవమి వేడుకలను నిర్వహించవద్దని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో ఎటువంటి ఆడంబరాలకు తావు లేకుండా పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ నెల 25 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ కార్యాలయంలోనే ఉదయం 10 గంటలకు పంచాంగ …
Read More »కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటది
రేపటి జనతా కర్ఫ్యూను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన రీతిలో 24 గంటలు పాటించి…విజయవంతం చేద్దామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం లో ఎలా పాల్గొన్నామో అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు. కరోనా పై ఈ యుద్దంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని చెప్పారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎళ్లుండి ఆరు …
Read More »తెలంగాణలో అర్టీసీ,మెట్రో రైల్ సర్వీసులు బంద్?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు దాదాపు ఇరవై నాలుగంటల పాటు రవాణా సర్వీసులు బంద్ కానున్నాయి. ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో …
Read More »తెలంగాణలో 21కి చేరిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు ఇరవై ఒకటికి చేరుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,274నిఘా బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశాల నుండి ఇప్పటివరకు తెలంగాణకు ఇరవై వేలకు పైగా మంది వచ్చారు. పదివేల మందికి పైగా కరోనా పరీక్షలు చేశాము. ఏడు వందల మందికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానం ఉంది.వీరందరికీ పరీక్షలు …
Read More »