తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి నక్కతోక తొక్కబోతున్నాడా..?. ఇప్పటికే గతేడాది జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రేవంత్ రెడ్డి ఓటమి పాలైన సంగతి విదితమే. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి టీఆర్ఎస్ అభ్యర్థి …
Read More »దేశానికే కేసీఆర్ దిక్సూచి..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
శుక్రవారం పార్లమెంటులో కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేనని ట్వీట్ చేశారు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పీఎం …
Read More »బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి..!!
కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నామామాత్రంగానే బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కాగా ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఆశించిన న్యాయం జరగలేదని పలువురు టీఆర్‌ఎస్ ఎంపీలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌పై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. ఏ రాష్ట్రానికి, ప్రజలకు …
Read More »సిద్దిపేట టౌన్ టార్గెట్ 20 వేల సభ్యత్వాలు.. హరీష్ రావు
సిద్దిపేట పట్టణంలో సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నాయకులను ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై సిద్ధిపేట పట్టణ నాయకులతో హరీష్ రావు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని వార్డులకు ఇంచార్జిలను నియమించారు. పట్టణం పరిదిలో 20 వేల సభ్యత్వాలు సేకరించాలని లక్ష్య నిర్దేశం చేశారు.పార్టీలో సభ్యత్వం తీసుకున్న సభ్యులకు రెండులక్షల బీమా సదుపాయం ఉంటుందని ఆయన …
Read More »పాడి పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట.. మంత్రి జగదీష్ రెడ్డి
పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో పైలెట్ ప్రాజెక్ట కింద ఎంపికయిన లబ్ధిదారులకు పాడిగేదెల పెంపకం(డైరీ) యూనిట్ల అందజేత, లబ్ధిదారుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో సూర్యాపేట నియోజకవర్గం వ్యాప్తంగా …
Read More »పార్లమెంట్ ఆవరణలోనే విమర్శలు గుప్పించిన విజయసాయి.. ఏ పోరాటానికైనా సిద్ధమని ప్రకటన
ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పెదవి విరిచారు. …
Read More »దేశ వ్యాప్తంగా “తెలంగాణ”రాష్ట్ర పథకం..!
యావత్తు దేశమంతా ఎంతో అసక్తితో పార్లమెంట్ సమావేశాలను గమనిస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెటును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ”మరో ఐదేళ్లలోపు అంటే 2024లోపు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని”ఆమె ప్రకటించారు. దీనికి జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్టు పేర …
Read More »ఆస్కా సలోమీ కి రెన్స్ నైటింగేల్ అవార్డ్
ప్రతి ఏడాది మే 12 నాడు ఇంటర్నేషనల్ నర్సస్ డే సందర్భంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే “ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్” ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుండి సీనియర్ నర్స్ ఆస్కా సలోమీ (ASKA SALOMI)గారికి వచ్చింది..ఈ నెలలో ఆమె ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకొనున్నారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ నందలి స్వగృహంలో ఆమెను కలసి అభినందించిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థకులు లక్ష్మణ్ రూడవత్..వెల్ …
Read More »బ్యాలెట్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా..వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బ్యాలెట్ …
Read More »అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు అల్లోల, తలసాని
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక మహాకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయం ఈవో మహేందర్‌కుమార్ , బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గోపిరెడ్డి …
Read More »