Home / SLIDER / దేశ వ్యాప్తంగా “తెలంగాణ”రాష్ట్ర పథకం..!

దేశ వ్యాప్తంగా “తెలంగాణ”రాష్ట్ర పథకం..!

యావత్తు దేశమంతా ఎంతో అసక్తితో పార్లమెంట్ సమావేశాలను గమనిస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెటును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ”మరో ఐదేళ్లలోపు అంటే 2024లోపు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని”ఆమె ప్రకటించారు.

దీనికి జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్టు పేర అమలుఃఏసేందుకు కేంద్ర జలశక్తి శాఖ దేశంలో అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపి .. పనిచేస్తుందని అన్నారు.ఆమె ఇంకా మాట్లాడుతూ”ఇండియా జలవనరుల భద్రతతో పాటు దేశంలోని అందరికీ సురక్షిత త్రాగునీరు అందించేందుకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

జలశక్తి మంత్రిత్వశాఖ ద్వారా దీనికి కీలక ముందడుగు పడనుంది..ఈ శాఖ దేశంలోని జలవనరుల నిర్వహాణ ,నీటి సరఫరా వ్యవహారాలను చూస్తుంది .. జల్ జీవన్ మిషన్ ద్వారా 2024నాటికల్లా ఇంటింటికి నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు… అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథ పేరిట ప్రతి ఇంటికీ త్రాగునీరు అందించబోతున్న సంగతి తెల్సిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి టీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ”తెలంగాణలో తమ ప్రభుత్వం అమలుచేస్తోన్న మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకుని జల్ జీవన్ మిషన్ పేరిట దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనుకోవడం శుభపరిణామం అని అంటున్నారు.