Home / TELANGANA (page 893)

TELANGANA

భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష…!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రెండు రోజులు వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు.  సీసీటీవీలు, డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించాలని …

Read More »

కేసీఆర్ తెలంగాణ గాంధీ…ఎంపీ మల్లారెడ్డి ప్రశంసలు…!

సత్యాగ్రహం, అహింస ఆయుధాలుగా పోరాడి రవి అస్తమించని బ్రిటీష్ పాలకులను తరిమి కొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించిపెట్టారు జాతిపిత మహాత్మాగాంధీ. గాంధీజీ బాటలో సత్యాగ్రహం, అమరణ నిరహారదీక్షలతో పూర్తిగా అహింసాయుత మార్గంలో ప్రజలందరిని ఏకం చేసి  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన కేసీఆర్‌‌ తెలంగాణ బాపూజీగా కొనియాడబడుతున్నారు..అదే కోవలో ఎంపీ మల్లారెడ్డి సీఎం కేసీఆర్‌ను తెలంగాణ గాంధీ అని ప్రశంసించారు. …

Read More »

టీటీడీపీ నేత మోత్కుపల్లికి చంద్రబాబు ఊహించని గిఫ్ట్ ..

తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అంటే టక్కున గుర్తుకు వచ్చేది గవర్నర్ గిరి కోసం గత మూడున్నరెండ్లుగా కలలు కంటున్నారు అని .అంతగా ఆయన గవర్నర్ గిరి కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు .అయితే దసరా పండగక్కి కేంద్రం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది . అయితే ఎప్పటిలాగే అటు కేంద్రంలో ఇటు ఏపీలో మిత్రపక్షంగా ఉన్న …

Read More »

టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ,కాంగ్రెస్ నేతలు…!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు . ఈ క్రమంలో మెదక్ జిల్లా కంగ్టి మండలం నాగర్ కే గ్రామానికి చెందిన టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు దాదాపు 50 మందికి పైగా కార్యకర్తలు స్థానిక …

Read More »

టీ కాంగ్రెస్ నేతలకు ఎంపీ గుత్తా కౌంటర్

కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కపై నల్లగొండ  ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జీవో 39, 40పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆరోపణలు సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ఆందోళన చేయడం తగదన్నారు. పంచాయతీరాజ్ చట్టం పరిధిలో వారికి ఈ జీవోలతో ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు ఎంపీ. ఉనికి కోసమే ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోమటిరెడ్డి …

Read More »

శ్రీరాంపూర్‌లో రేవంత్ రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రచారం…!

సింగరేణి ఎన్నికల సందర్భంగా టీటీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు బలపర్చిన ఏఐటీయూసీ తరపున టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మంగళవారం శ్రీరాంపూర్ డివిజన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి టీబీజీకేఎస్‌కు ఓటేస్తే సింగరేణిని అమ్మడం ఖాయమని అన్నారు. కేసీఆర్ మాయమాటలతో కార్మికులను మరోసారి మోసం చేయాలని  చూస్తున్నారన్నారు. కేసీఆర్ గారడి మాటలను నమ్మి కార్మికులు మోసపోవద్దని రేవంత్ కోరారు.  అయితే రేవంత్‌తో పాటు కాంగ్రెస్, సీపీఐ …

Read More »

లండన్ లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ మరియు దసరా” సంబరాలు

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్   కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో  లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి  ఆరు వందలకు పైగా  ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే. టి. ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం …

Read More »

దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి వారసత్వ ఉద్యోగం..ఎంపీ కవిత..!

వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ అవకాశ: కల్పిస్తామని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ప్రకటించారు..మంగళవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు రూ. 6 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని తెలిపారు. సింగరేణి ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కవిత టీబీజేకేఎస్ శ్రేణులను హెచ్చరించారు..గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల హక్కులను కాలరాశాయని ఆమె …

Read More »

హైదరాబాద్‌ వాసులకు సలహా …

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ మహా  నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేడు  భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కుమ్యులో నింబస్ మేఘాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. నిన్న కుమ్యులో నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో హైదరాబాద్‌లోనే అధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఉపరితల ద్రోణి …

Read More »

కేసీఆర్ సింగరేణి హామీలపై నిలదీసిన కిషన్ రెడ్డి…!

సీఎం కేసీఆర్ మాటల గారడీతో మరోసారి సింగరేణి కార్మికులను మోసం చేస్తున్న బిజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిలో కారుణ్య నియామాకాల పేరుతో వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయంలో కోర్టులో ఎందుకు తెలపలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తే ఇప్పుడు ఇతర సంఘాల నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి నిలదీశారు. సింగరేణి ప్రాంతంలో మెడికల్ …

Read More »