Home / Uncategorized (page 60)

Uncategorized

ఒక వైపు పురిటి నొప్పులు.. ఇంకోవైపు గుంతల రోడ్లు… ఆ తల్లి భాద

నాగరిక సమాజానికి దూరంగా ఉండే మన్యం ప్రాంతాల్లో.. రవాణా సౌకర్యానికి కూడా నోచుకోని మారుమూల తండాల్లో ప్రసవ వేదన పడుతున్న గర్భిణులను మంచాలపై మోసుకురావడం గురించి విని ఉంటాం. అనారోగ్యంతో మంచం పట్టిన గిరిజనుల్ని కావడి కట్టుకొని ఆస్పత్రికి తరలించడం చూసి ఉంటాం. కానీ పట్టణ ప్రాంతాల్లో సైతం నేటికీ ఇలాంటి అవస్థలు తప్పడం లేదనడానికి నిదర్శనమే ఈ చిత్రం.  గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారులో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి …

Read More »

కన్న కూతుర్ని …. కన్న తండ్రే

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఎండ్రీయాల్ గ్రామంలో పదో తరగతి చదువుతున్న తన కూతురు శ్రీజను, కన్న తండ్రే గొడ్డలితో నరికి చంపేశాడు. సంఘటన సమయంలో కన్న తల్లి ఇంట్లో లేదు. బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి వచ్చేసరికి కూతురు పడిపోయి ఉంది. అయితే కూతురు పడుకుంది అని తల్లి భావించింది. ఉదయం ఎంతకూ నిద్ర లేవకపోవడంతోపాటు రక్తపు మడుగు కనిపించడంతో తల్లి సాయవ్వ షాక్‌కు గురైంది. …

Read More »

ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పలు  ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు శ్రీరామ్ సాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 42,800 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 8862 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1078.60 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 48.698 టీఎంసీలు. …

Read More »

బంగారం ధర పతనం ..

ఈ రోజు  బంగారం ధర పతనమైంది. మొత్తం  రూ.200 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,550కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి పసిడి కొనుగోళ్లు మందగించడంతో ధర పడిపోయినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో బంగారం ధర ఏడు వారాల కనిష్ఠానికి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. రూ.600 ధర తగ్గి కేజీ వెండి రూ.40,200కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, …

Read More »

లండన్‌లో ఘనంగా “టాక్ – చేనేత బతుకమ్మ, దసరా” సంబరాలు..!

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్   కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో  లండన్ లో చేనేత బతుకమ్మ  – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి  ఆరు వందలకు పైగా  ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే. టి. ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం జరిపిన వేడుకలను …

Read More »

భూముల క్రమబద్ధీకరణలోటీఆర్ఎస్ సర్కారు సంచలన నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్రంలో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణలో ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది.తెల్ల కాగితంపై ఐదెకరాలకు పైబడి కొనుగోలు చేసిన భూములనూ సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. పాత దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులపై చర్చించిన అధికారులు సీఎం కేసీఆర్‌ అనుమతితో ఐదెకరాలకు పైబడిన భూములకు రెవెన్యూ చట్టాల మేరకు డ్యూటీ తీసుకొని క్రమబద్ధీకరించి, యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఎంతో కాలంగా క్రమబద్ధీకరణకోసం …

Read More »