Blog Layout

పాయల్‌రాజ్‌పుత్‌ న్యూ లుక్

పాయల్‌రాజ్‌పుత్‌ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘5 డబ్ల్యూస్‌’ (ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). ‘సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు’ ఉపశీర్షిక. ప్రణదీప్‌ ఠాకోర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కైవల్య క్రియేషన్స్‌ పతాకంపై యశోద ఠాకోర్‌ నిర్మిస్తున్నారు. జనవవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పరిశోధనాత్మక మిస్టరీ డ్రామా ఇది. పాయల్‌రాజ్‌పుత్‌ను సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. మునుపెన్నడూ చూడని విధంగా ఆమె నటనలో భిన్న పార్శాలు …

Read More »

రకుల్‌ప్రీత్‌సింగ్‌ కి కరోనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. కరోనా నిర్ధారణ కావడంతో తాను స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లాను. తనను కలిసి వ్యక్తులందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి బాగుందని..తగినంత విశ్రాంతి తీసుకొని తిరిగి షూటింగ్స్‌కు హాజరవుతానని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్‌ తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు …

Read More »

అంతర్జాతీయ బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి

తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప చిత్ర కారున్ని కోల్పోయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అంతర్జాతీయ బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బాలయ్య మరణం చిత్ర కళారంగానికి తీరని లోటన్నారు. ఎంతో మంది కళాకారులను తయారు చేసి ఆయన అందించిన సేవలు సిద్దిపేట గడ్డ మరవదన్నారు. జాతీయ స్థాయిలో బాతిక్ చిత్ర కళాకారునిగా బాలయ్య ఎంతో …

Read More »

సిరులవేణి సింగరేణి: ఎమ్మెల్సీ కవిత

 సింగరేణి కాలరీస్‌ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. పుడమి పొరల్లోంచి బొగ్గును వెలికితీస్తూ దేశ పారిశ్రామిక రంగానికి సింగరేణి వెన్నుదన్నుగా నిలుస్తున్నదని అన్నారు. సిరులవేణి సింగరేణి తెలంగాణకే తలమానికంగా నిలిచిందని ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ మకుటం.. నల్ల బంగారం.. సిరుల సింగారం.. మన సింగరేణి. పుడమి పొరల్లోంచి నల్ల బంగారం వెలికి తీస్తూ దేశ పారిశ్రామికరంగానికి జవసత్వాలను, దక్షిణాది రాష్ట్రాలకు వెలుగు రేఖలను …

Read More »

బీజేపీలో పావులు కదుపుతున్న బండి సంజయ్ వర్గం

తెలంగాణ బీజేపీలో ఆధిపత్య రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీ మీద పట్టుకోసం బండి వర్గం – కిషన్ రెడ్డి వర్గం నువ్వా నేనా పావులు కదుపుతున్నారు. తెలంగాణ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు అద్దం పడుతోంది. మరోవైపు రాజా సింగ్ బండి సంజయ్ వర్గంలో చేరడంతో చలికాలంలో …

Read More »

గల్ఫ్ కార్మికుల ఉసురుపోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం…

గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన రెండు సర్కులర్ల ను వెంటనే ఉపసంహరించుకోవాలి . గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతి పాదాన లేకున్నా భారత ప్రభుత్వం భారత ప్రవాసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడం చాల బాధాకరమైన విషయం. స్వదేశంలో సరైన వేతనాలు లేక భార్యా పిల్లలను వదిలి లక్షలు అప్పుచేసి గల్ఫ్ లో పది రూపాయలు సంపాదించుకుంటామని వస్తే …

Read More »

దేశంలో కొత్తగా 23,950కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 23,950కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కి చేరుకుంది. ఇందులో మొత్తం యాక్టివ్ కేసులు 2,89,240. మొత్తం కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 96,63,382. తాజాగా కరోనాతో 333మంది మృత్యు వాత పడ్డారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు1,46,444మంది మరణించారు.

Read More »

ముచ్చటగా మూడో సినిమాతో ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ముచ్చటగా మూడో సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా “మిడిల్ క్లాస్ మెలోడీస్” మూవీతో హిట్ కొట్టాడు ఆనంద్. అదే జోష్ లో ఆనంద్ ఇప్పుడు మూడో సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ దేవరకొంద తన సొంత బ్యానరైన కింగ్ ఆఫ్ …

Read More »

పీవీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత నివాళి

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞాన‌భూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళుల‌ర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె శ్రీవాణి, కుమారుడు పీవీ ప్ర‌భాక‌ర్ రావు ఉన్నారు. పీవీ జ్ఞాన‌భూమి వ‌ద్ద నివాళుల‌ర్పించిన వారిలో మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశ‌వ‌రావు, హోంమంత్రి మ‌హ‌ముద్ అలీతో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. పీవీ …

Read More »

పీవీ దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంత‌ర‌ సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పీవీ ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ మాజీ ప్ర‌ధాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat