Blog Layout

గులాబీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో గులాబీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం సందర్బంగా గత నెల ఇరవై ఏడో తారీఖు నుండి జరుగుతున్న పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాల గురించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ పనితీరుపై.. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన పలు వ్యుహ్యాలపై చర్చించనున్నట్లు సమాచారం. …

Read More »

‘గేల్ కు కోటిన్నర ఇవ్వండి’: కోర్టు తీర్పు

ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్‌ ఫాక్స్‌ పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో వెస్డిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌‌ విజయం సాధించాడు. గేల్ పరువుకు నష్టం కలిగించినందుకు దాదాపు కోటిన్నర రూపాయలు చెల్లించాలని న్యూసౌత్‌ వేల్స్‌ న్యాయస్థానం తీర్చు ఇచ్చింది. 2015 వరల్డ్‌ కప్‌ సందర్భంగా సిడ్నీ స్టేడియంలోని డ్రెస్సింగ్‌‌ రూమ్‌ లోకి మసాజ్‌ చేయడానికి వచ్చిన మహిళ పట్ల గేల్‌‌ అసభ్యం గా ప్రవర్తించాడని ఫెయిర్‌ఫాక్స్‌ పత్రిక కథనం …

Read More »

నేడు తెలంగాణ క్యాబినేట్ భేటీ..!

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు బుధవారం సమావేశం కానుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ క్యాబినేట్ సమావేశం జరగనున్నది. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా ప్రవేశ పెట్టనున్న మున్సిపల్ బిల్లుతో పాటుగా గతంలో జారీచేసిన పలు ఆర్డినెన్స్ లకు మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నది. అయితే ప్రస్తుతం తీసుకురానున్న నూతన …

Read More »

బీజేపీలోకి రాయపాటి..? రెండు రోజుల్లో ఢిల్లీకి

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ… తెలుగు రాష్ట్రాల్లోనూ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అసంతృప్తి నేతలను, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాయపాటిని బీజేపీ నేత రాం మాధవ్ కలిశారు. రాయపాటి ఇంటికి వెళ్లి మరీ బీజేపీలో చేరాల్సిందిగా …

Read More »

నటి జ్యోతికపై ఫిర్యాదు..!

సినీ నటి జ్యోతికపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రాక్షసి’. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ సినిమాలో టీచర్లు పిల్లలకు సరిగా పాఠాలు చెప్పకుండా కథల పుస్తకాలు చదువుకుంటున్నట్లు, సెల్ ఫోన్ తో కాలం గడుపుతున్నట్లు చూపించారు. గవర్నమెంట్ …

Read More »

కర్నూలు కలెక్టర్‌ను అభినందించిన సీఎం వైఎస్ జగన్..ఎందుకో తెలుసా

‘ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు చేసుకోగలిగామని ప్రజలంతా సంతృప్తి చెందాలి.. రాష్ట్రంలో ఆ పరిస్థితి తీసుకురావడమే మన ముందున్న లక్ష్యం..’అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జూలై 1వతేదీ నుంచి 12 వరకు జిల్లాలవారీగా అందిన వినతిపత్రాలు, పరిష్కారాలపై సీఎం జగన్‌ మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. …

Read More »

కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటుచేయండి..ఎంపీ బండ

తెలంగాణలో కొత్త ఎయిర్‌ పోర్టులను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బండ ప్రకాశ్ యాదవ్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో ఎంపీ బండ ప్రకాశ్ మాట్లాడుతూ..కేంద్రం పెద్ద పెద్ద విమానాశ్రయాల అభివృద్ధిపైనే దృష్టి పెడుతోందని, రాష్ట్రాల్లో మినీ ఎయిర్‌ పోర్టులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరారు. మామునూర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రామగుండం, కొత్తగూడెంలలో …

Read More »

వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..!!

రానున్న మూడు నెలల్లో వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సహకారంతో వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి …

Read More »

ఎమ్మెల్యే సుమన్‌ ఆధ్వర్యంలో కాళేశ్వరం జలజాతర..!!

అన్నారం బ్యారేజ్ వద్ద సామూహిక వనభోజనాల కార్యక్రమాన్ని ఇవాళ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏర్పాటుచేశారు. జల జాతర సందర్భంగా గోదావరి తల్లికి పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ,ఎమ్మెల్యేలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు,చెన్నూర్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వేలాది మంది కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ,అన్నారం బ్యారేజ్‌లు జలభాండాగారాలను తలపిస్తున్నాయి. ప్రాణహిత నుంచి గోదావరిలోకి ఇన్‌ఫ్లో నిలకడగా వస్తుండటంతో నీటినిల్వ రోజురోజుకి పెరిగిపోతోంది. మేడిగడ్డ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌..!

ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియర్‌ నేత విశ్వభూషణ్‌ హరిచందన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న నరసింహాన్‌ ఇక నుంచి తెలంగాణకు మాత్రమే పరిమితం కానున్నారు. ఒడిశాకు చెందిన విశ్వభూషణ్‌ హరిచందన్‌ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి మరో రెండు సార్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat