Classic Layout

ఏపీలో కరోనా అప్డేట్ – కొత్తగా 1,886 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1,886 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షల 46 వేల 245కి చేరింది. ఇందులో 20,958 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు లక్షల 18 వేల 473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 12 మంది కరోనాతో చనిపోగా, మొత్తం 6814 కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికలు- అదే టీఆర్ఎస్ కొంపముంచింది..!

తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు కారును పోలిన గుర్తును కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 3,489 ఓట్లు పడ్డాయి. దీంతో కొంతమంది దుబ్బాక ఓటర్లు పొరపాటుగా అతనికి ఓటు వేసి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

Read More »

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్ రావు

దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు ప్రజా తీర్పును శిరసావహిస్తామని..టీఆర్ఎస్  కు ఓటేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి.. ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. ఓడినా దుబ్బాక ప్రజల్లోనే ఉంటామన్న హరీశ్. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

Read More »

ఫలితాలపై సమీక్షించుకుంటాం:మంత్రి కేటీఆర్

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఆశించిన విధంగా ఫలితాలు ఎందుకు రాలేదనే విషయంపై త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు. సమీక్ష అనంతరం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామన్నారు. దుబ్బాక ఫలితంతో అప్రమత్తం అవుతామన్నారు. తాము విజయాలకు పొంగిపోము, ఓటమికి కుంగిపోమన్నారు.

Read More »

రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 200 ఐపీఎల్  మ్యాచు లు ఆడిన 2వ క్రికెటర్ రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ ఆడటం ద్వారా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నడు హిట్ మ్యాన్… ముంబై ఇండియన్స్ తరఫున 155 మ్యాచ్ లను ఆడాడు. నాలుగు వేల పరుగుల మైలురాయికి హిట్ మ్యాన్ మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా రోహిత్ కంటే ముందు  …

Read More »

బీహార్ ఎన్నికల ఫలితాలు-మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మెజార్టీకి (122) కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 124 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకుంది.. మహాకూటమి చివరివరకు ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. ఎల్ జేపీ  ఒక స్థానంలో, ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించగా.. మహాకూటమి 110 స్థానాల్లో విజయం సాధించింది

Read More »

తెలంగాణలో కరోనా అప్డేట్ -కొత్తగా 1,196 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,53,651కి చేరింది ఇందులో 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,34,234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఐదుగురు కరోనాతో మృతిచెందగా, మొత్తం 1,390 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 47,29,401 కరోనా టెస్టులు చేశారు.

Read More »

కరోనా అప్డేట్ – దేశంలో 86 ల‌క్ష‌లు క‌రోనా కేసులు

శంలో క‌రోనా కేసులు 86 ల‌క్ష‌లు దాటాయి. గ‌త కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంటల్లో కొత్తగా 44,281 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 86,36,012కు చేరింది. ఇందులో 80,13,784 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 4,94,657 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, క‌రోనా బారిన‌ప‌డినవారి …

Read More »

జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో వేస్ట్ టూ ఎన‌ర్జీ ప్లాంట్ ప్రారంభం

హైద‌రాబాద్   న‌గ‌రంలోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్‌ వ్యర్థాలతో విద్యుత్‌(వేస్ట్‌ టూ ఎనర్జీ)ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు. 19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం. ఘన …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-8వ రౌండ్ ముగిసేవరకు..!

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుతం 200 అధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి చూస్తే మొదట ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండగా.. ఆరో రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థే వరుసగా ఆధిక్యంలో ఉంటూ వస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat