rameshbabu
September 25, 2020 SLIDER, SPORTS
1,658
అద్భుత ఆల్‌రౌండ్ షోతో అలరించిన కింగ్స్ లెవన్ పంజాబ్ బోణీ చేసింది. ముందుగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 నాటౌట్) అజేయ శతకంతో భారీ స్కోరుకు బాటలు వేయగా.. ఆ తర్వాత స్పిన్నర్లు ఎం.అశ్విన్ (3/21), రవి బిష్ణోయ్ (3/32) సుడులు తిరిగే బంతులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోలుకోలేకపోయింది. ఫలితంగా పంజాబ్ ఏకంగా 97 పరుగుల తేడాతో ఘనవిజయం సా …
Read More »
rameshbabu
September 25, 2020 MOVIES, SLIDER, SPORTS
1,736
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో నటి షెర్లిన్ చోప్రా సంచలన విషయం వెల్లడించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్ ఉపయోగించేవారని తెలిపింది. ఓసారి ఈ దృశ్యాని తాను చూశానని పేర్కొంది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘గతం లో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత జరిగిన పార్టీకి హాజరయ్యా. ప్రముఖ క్రికెటర్లు, వారి భార్యలు …
Read More »
rameshbabu
September 25, 2020 SLIDER, SPORTS
1,361
పాకిస్థాన్ వెటరన్ పేసర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు 36 ఏళ్ల గుల్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. త్వరలో జరగనున్న జాతీయ టీ20 కప్.. ఆటగాడిగా అతడికి ఆఖరిది. 2003లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఉమర్.. అదే ఏడాది టెస్ట్ జ ట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 2016లో ఇంగ్లండ్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. …
Read More »
rameshbabu
September 25, 2020 ANDHRAPRADESH, SLIDER
1,047
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,54,385కి పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదవగా.. ప్రకాశంలో 927 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, …
Read More »
KSR
September 24, 2020 POLITICS, SLIDER, TELANGANA
697
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా పని చేయాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీలతో కేటీఆర్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాజా ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతాయని ఈ నేపథ్యంలో …
Read More »
rameshbabu
September 24, 2020 SLIDER, SPORTS
1,451
ముంబాయి ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ (54 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 80) అర్ధ శతకంతో విరుచుకుపడడంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముంబై 49 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195/5 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 47) రాణించాడు. యువ పేసర్ శివమ్ …
Read More »
rameshbabu
September 24, 2020 SLIDER, TELANGANA
868
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,173 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,246 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 2004 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. మొత్తం 1,48,139 మంది బాధితులు ఇండ్లకు వెళ్లారు. వైరస్ ప్రభావంతో కొత్తగా 8 మంది మృత్యువాతపడగా.. ఇప్పటికీ 1070 మంది …
Read More »
rameshbabu
September 24, 2020 SLIDER, TELANGANA
710
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయభూముల వద్ద, బావులకాడి ఇండ్లు, ఫామ్‌హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉచితంగా మ్యుటేషన్ (ఎన్‌రోల్) చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్నవారికి దేశంలోనే తొలిసారిగా పట్టాదార్ పాస్‌పుస్తకం జారీచేయనున్నట్టు తెలిపారు. మెరూన్ కలర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన పాస్‌పుస్తకాలను అందజేస్తామని చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులకు పూర్తిరక్షణ …
Read More »
rameshbabu
September 24, 2020 SLIDER, TELANGANA
640
తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టిన రాష్ట్రప్రభుత్వం సులభ వాణిజ్య విధానం (ఈవోడీబీ)లో మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. ఈవోడీబీలో తాము చేపట్టనున్న సంస్కరణలతో ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఈవోడీబీ -2020 సంస్కరణలపై బుధవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా …
Read More »
rameshbabu
September 24, 2020 MOVIES, SLIDER
1,209
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ కొనసాగుతుండగా..లొకేషన్ లో రకుల్ ప్రత్యక్షమైన స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లంగావోణిలో కనిపిస్తున్న రకుల్ ఎరుపు రంగు కలర్ షర్టును వేసుకోవడం ఫొటోలో గమనించవచ్చు. తెలుగు నవల కొండపొలం …
Read More »