rameshbabu
March 1, 2022 MOVIES, SLIDER
815
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా ఇటీవల విడుదలైన ‘భీమ్లానాయక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో దాదాపు రూ. 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టినట్టు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ జానపద చిత్రంలో నటిస్తుండగా.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని త్వరలోనే …
Read More »
rameshbabu
March 1, 2022 Uncategorized
598
తెలంగాణ అన్నింటిల్లోనూ వెలిగిపోతోందని, ఆ వైభవమే కాదు.. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విజయపథంలో దూసుకువెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు. దేశంలోనే …
Read More »
rameshbabu
March 1, 2022 INTERNATIONAL, SLIDER
735
చైనా వుహాన్ నగరంలోని హ్వానాన్ చేపల మార్కెట్ నుంచే కరోనా వైరస్ వ్యాపించిందని, ల్యాబ్ నుంచి కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొదటిసారి కరోనా జంతువుల నుంచి మానవులకు 2019, నవంబర్ లేదా డిసెంబర్లో వ్యాపించినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్ది వారాల్లో మార్పు చెందిన కొవిడ్ వైరస్లో కేసులు నమోదయ్యాయని తెలిపింది. కానీ, కచ్చితంగా ఏ జంతువు నుంచి మానవులకు సోకిందో ఆ అధ్యయనాలు నిర్ధారించలేకపోయాయి.
Read More »
rameshbabu
March 1, 2022 NATIONAL, SLIDER
710
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో 9,01,647 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 6,915 కొత్త కేసులు నమోదయ్యాయి. 180 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ తో 5,14,203 మంది మృతిచెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 92,472కు తగ్గింది. ఇప్పటివరకు దేశంలో 177.70 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.
Read More »
rameshbabu
March 1, 2022 BUSINESS, SLIDER
1,100
అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.
Read More »
rameshbabu
March 1, 2022 LIFE STYLE, SLIDER
734
ఉదయాన్నే తీసుకునే మంచి అల్పాహారాల్లో పోహ కూడా ఒకటి. దీనిని తయారీ చాలా సులువు. చాలా లైట్ ఫుడ్. అటుకులను ముందుగా నీళ్లతో శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్పై పెనం పెట్టి, నూనె పోసి వేడిచేయాలి. జీలకర్ర, శెనగ పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు వేసి 5ని.లు కలియబెట్టాలి. ఇప్పుడు అటుకులు వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి …
Read More »
rameshbabu
March 1, 2022 BHAKTHI, SLIDER
5,931
శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. తరుచూ నీరు తాగుతూ ఉండాలి. గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు. కార్బోహైడ్రేట్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఘాటైన పదార్థాలు తినకండి. గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచిది. జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దేవునిపై శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి.
Read More »
rameshbabu
March 1, 2022 BUSINESS, NATIONAL, SLIDER
1,332
శవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 105, కోల్కతాలో రూ. 108 మేర పెరిగింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.27 ఎగబాకింది. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ (గృహావసరాల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Read More »
rameshbabu
March 1, 2022 NATIONAL, SLIDER, TELANGANA
860
ఉత్తరప్రదేశ్ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అసెంబ్లీ స్థానం పరిధిలో ప్రచారం ఉండవచ్చు. ఈ సెగ్మెంట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ వంటి నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు..తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వారితో కలిసి వెళ్తారా? లేక ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటారా? అనేది తెలియాల్సి …
Read More »
rameshbabu
March 1, 2022 MOVIES, SLIDER
587
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. వైబ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరు జీపు బంపర్పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తమన్నా, కీర్తిసురేష్, రావు రమేశ్, రఘుబాబు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.
Read More »