Classic Layout

లంగావోణి ప‌ల్లెటూరి అమ్మాయిలా జాన్వీక‌పూర్

దేశవ్యాప్తంగా దీపావ‌ళి వేడుక‌లుఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌జ‌లంతా ఆనందోత్సాహాల‌తో ట‌పాసులు కాలుస్తూ దీపావ‌ళిని జ‌రుపుకుంటున్నారు. సెల‌బ్రిటీలు ట్రెండీ స్టైల్‌ను ప‌క్క‌న పెట్టి సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో పండుగ జ‌రుపుకున్నారు. బాలీవుడ్  బ్యూటీ జాన్వీక‌పూర్ ముంబైలోని నివాసంలో కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి దీపావ‌ళిని జ‌రుపుకుంది. పొట్టి దుస్తుల్లో క‌నిపించే జాన్వీక‌పూర్ ఈ సారి లంగావోణి ప‌ల్లెటూరి అమ్మాయిలా క‌నిపించింది. జాన్వీ సోద‌రి ఖుషీక‌పూర్ కూడా లంగావోణి వేసుకోగా..బోనీక‌పూర్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా వేసుకున్నారు. …

Read More »

సమంత షాకింగ్ డిసెషన్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ ..సమంత కమిటవబోయో కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేస్తుందా.! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన తర్వాత తన కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది సమంత. పూర్తిగా నచ్చిన కథకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమె తెలుగులో ‘శాకుంతలం’, తమిళం మల్టీస్టారర్ మూవీ ‘కాతు వాకుల రెండు కాదల్’ …

Read More »

విజయ్ సేతుపతికి అవమానం

 ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతిపై బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. చెన్నై నుంచి విమానం దిగి బాడీగార్డులతో కలసి నడిచి వెళుతున్న ఆయన్ను అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక వ్యక్తి ఎగిరి తన్నాడు. అదే సమయంలో మరోవ్యక్తి కూడా దాడికి ప్రయత్నించాడు. తక్షణం వారిని అడ్డుకున్న బాడీగార్డులు అప్రమత్తమై విజయ్‌ను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ …

Read More »

ఈటల రాజేందర్‌ పై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈటల రాజేందర్‌, ఆయన అనుచరులపై కేసు నమోదు …

Read More »

టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌

టీమ్ ఇండియా హెడ్‌కోచ్‌గా బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. న్యూజీలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి ద్రవిడ్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తారు. సులక్షణా నాయక్, ఆర్‌పీ సింగ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. 

Read More »

టీమిండియా ఘన విజయం

టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో..  బోణీ చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోహిత్‌ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. గ్రూప్‌-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత …

Read More »

దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు

దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు వినిపించింది. దాదాపు ఏడాదిగా అరకొర సందర్భాల్లో పెంచడమే తప్ప తగ్గించని పెట్రో ధరలను ఎట్టకేలకు తగ్గించింది. పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబరు 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎక్సైజ్‌ డ్యూటీని పెట్రోలు (రూ.5) కన్నా డీజిల్‌పై రెట్టింపు …

Read More »

అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన అమలపాల్

ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన హీరోయిన్‌ అమలాపాల్‌ ఎక్స్‌పోజింగ్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని ఆమె తన ఫొటోలను షేర్‌ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘సింధుసమవెలి’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత కోలీవుడ్‌లో ‘మైనా’, ‘వేట్టై’, ‘వేలైయిల్లా పట్టాదారి-1, 2’, ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’, ‘రాక్షసన్‌’ వంటి …

Read More »

కొవాక్సిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్

దేశీయ కంపెనీ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాక్సిన్‌ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగ అనుమతి లభించింది!! అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా సంస్థలతో పోటీ పడి.. వారికి దీటుగా అత్యంత వేగంగా టీకా తయారుచేసినా రకరకాల రాజకీయాల కారణంగా ఇన్నాళ్లుగా లభించని డబ్ల్యూహెచ్‌వో ఆమోదం ఎట్టకేలకు పండగ వేళ లభించింది. బుధవారంనాడు సమావేశమైన డబ్ల్యూహెచ్‌వో ‘సాంకేతిక సలహాదారుల బృందం’.. ఈ టీకాకు ‘ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌’ …

Read More »

ఏపీలో కరెంటు ఛార్జీల మోత

ఏపీ రాష్ట్ర ప్రజలకు మరో ట్రూఅప్‌ చార్జీల ముప్పు పొంచి ఉంది. రూ.528.71 కోట్ల వసూలుకు ట్రాన్స్‌కో సిద్ధమైంది. 2014-15 నుంచి 18-19 మధ్య నిర్వహించిన వాణిజ్య కార్యకలాపాలకు గాను తనకు రూ.528.71 కోట్ల మేర అధిక వ్యయం అయిందని.. ఈ మొత్తాన్ని విద్యుత్‌ వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)ని కోరింది. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat