Classic Layout

చారిత్రాత్మ‌కంగా యాదాద్రి

యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మ‌కంగా జ‌రుగుతున్న‌ద‌ని, ఈ నిర్మాణం చేప‌ట్టిన సీఎం కెసిఆర్, చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయే విధంగా ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ క‌రోనా క‌ష్ట కాలంలోనూ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ధికి అద్దంప‌ట్టేలా ఉంద‌ని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, సీఎం కెసిఆర్, ఆయ‌న కుటుంబం చిరాయువుగా …

Read More »

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభణ

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్‌ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం కావడం విశేషం. అదేవిధంగా చాలా రోజుల తర్వాత మరణాలు రెండు వందలు దాటాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటివకు 212 మంది మృతిచెందారు.దీంతో మొత్తం కేసులు 1,16,46,081కు …

Read More »

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు క‌రోనా

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాకు క‌రోనా సోకింది. ఈ నెల 19న ఆయ‌న కొవిడ్ పాజిటివ్ అని తేలింద‌ని, శ‌నివారం ఆయ‌న‌ ఎయిమ్స్‌లో చేరిన‌ట్లు ఆ ఆసుప‌త్రి వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని ఆదివారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌లో తెలిపింది.

Read More »

ఫలించిన ‘సోషల్‌’ వ్యూహం!

ఒకప్పుడు ఇంటింటి ప్రచారం, గోడరాతలు, కరపత్రాలు, పోస్టర్లు కనిపించేవి. కానీ ఇప్పుడంతా ‘నెట్టింట’ ప్రచారమే హోరెత్తుతున్నది. వ్యూహ ప్రతివ్యూహాలు, విమర్శలు.. ఎదురుదాడులు.. అంతా సోషల్‌ మీడియాలోనే. తాజాగా హోరాహోరీగా జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లోనూ సోషల్‌ మీడియా ప్రధాన భూమిక పోషించింది. బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే సోషల్‌మీడియాను విరివిగా వాడుకుంటూ లబ్ధి పొందుతున్నది. ప్రత్యర్థులపై దాడికి, ఆరోపణలకు, విమర్శలకు సామాజిక మాధ్యమాలపై ఆధారపడుతున్నది. …

Read More »

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం జీరో అవ‌ర్ చేప‌ట్ట‌నున్నారు. ఆ త‌ర్వాత బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మాధానం ఇవ్వ‌నున్నారు. నేడు స‌భ‌లో పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

Read More »

తెలంగాణ అసెంబ్లీ‌ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఐదో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. 6 ప్ర‌శ్నోత్త‌రాల‌కు ప్ర‌భుత్వం స‌మాధానం ఇవ్వ‌నుంది. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం జీరో అవ‌ర్ జ‌ర‌గ‌నుంది. అనంత‌రం బ‌డ్జెట్‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ నెల 18న మంత్రి హ‌రీష్ రావు బ‌డ్జెట్‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే.

Read More »

చరిత్రలో లేనివిధంగా ఖమ్మంలో తొలిసారిగా వైఎస్ షర్మిల

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్‌ కుమారుడైన మహమ్మద్‌ అసదుద్దీన్‌ శుక్రవారం లోట‌స్‌పాండ్‌లో షర్మిలను కలిశారు. అసదుద్దీన్‌తో పాటుగా ఆయన భార్య ఆనం మీర్జా కూడా ఉన్నారు. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా మీర్జాకు ఆనం మీర్జా సోదరి. రాజకీయ, క్రీడా రంగాల్లో ప్రముఖులైన అజారుద్దీన్‌, సానియా మీర్జాల కుటుంబ సభ్యులు కొత్తగా పార్టీ పెట్టనున్న షర్మిలను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారు మర్యాద పూర్వకంగానే కలిశారని లోట్‌సపాండ్‌ వర్గాలు …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో 1నుండి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పాఠశాలల్లో కేసులు పెరుగుతుండటంతో 6,7,8 తరగతుల ప్రత్యక్ష బోధనను నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 9వ తరగతి విషయంలోనూ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన కొనసాగించే అవకాశం ఉంది. సోషియో ఎకనామిక్ ఔట్లుక్ నివేదికలో ఈ విషయాన్ని తెలియజేసింది.

Read More »

మార్చి 22న సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఈ నెల 22న శాసనసభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. బడ్జెట్ పై చర్చ తర్వాత. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ పై ప్రసంగిస్తారు. ఆ రోజే పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 29-31% శాతం వరకు ఈ ఫిట్మెంట్ ప్రకటించే ఛాన్సుంది. దీనికితోడు కరోనాపై సీఎం కీలక …

Read More »

తగ్గిన బంగారం ధరలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.45,930కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.42,100గా ఉంది. ఇక వెండి కేజీపై రూ.1000 తగ్గి రూ.71,500గా ఉంది

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat